స్టార్‌బక్స్ నూతన సీఈవోగా.. భారత సంతతి వ్యక్తి
Interesting facts about Indian-born Laxman Narasimhan, the new CEO of Starbucks. ప్రముఖ కాఫీ దిగ్గజం స్టార్‌బక్స్ సీఈవోగా భారత సంతతి వ్యక్తి లక్ష్మణ్ నరసింహన్‌ను నియమిస్తున్నట్లు ఆ కంపెనీ ప్రకటించింది.
By అంజి Published on 2 Sep 2022 7:25 AM GMTప్రముఖ కాఫీ దిగ్గజం స్టార్‌బక్స్ సీఈవోగా భారత సంతతి వ్యక్తి లక్ష్మణ్ నరసింహన్‌ను నియమిస్తున్నట్లు ఆ కంపెనీ ప్రకటించింది. అలాగే బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్‌లో సభ్యుడిగానూ ఉంటారని స్టార్‌బక్స్ గురువారం ప్రకటించింది.వచ్చే నెల ఒకటో తేదీ నుంచి ఆయన స్టార్‌బక్స్ సీఈవోగా బాధ్యతలు చేపడతారు. అలాగే 2023 ఏప్రిల్ వరకు స్టార్‌బక్స్ తాత్కాలికగా చీఫ్‌గా హోవార్డ్ స్కల్జ్ కొనసాగుతారు. లక్షణ్ నరసింహన్ వయస్సు 55 ఏళ్లు. ఆయన గతంలో లైసాల్ అండ్ ఎన్‌ఫామిల్ బేబీ ఫార్ములా కంపెనీలో సీఈవోగా పని చేశారు.
కాగా తమ కంపెనీకి రాబోయే నూతన సీఈవో ఓ అసాధారణ వ్యక్తి అని భావిస్తున్నట్లు స్టార్‌బక్స్ తెలిపింది. లక్ష్మణ్ ట్యాలెంట్ ఉన్న లీడర్ అని స్టార్‌బక్స్ బోర్డు చైర్ వుమెన్ మెల్లోడీ హాబ్సన్ తెలిపారు. ప్రస్తుతం లండన్‌లో ఉన్న లక్ష్మణ్.. స్టార్‌బక్స్ కోసం అమెరికాలో సియాటిల్ వెళ్లనున్నారు. భారత సంతతి వ్యక్తి దిగ్గజ స్టార్‌బక్స్ సీఈవో నియమితులవ్వడం ఎంతో మంచి విషయం. గతంలో పెప్సికోలో గ్లోబల్ చీఫ్ కమర్షియల్ ఆఫీసర్‌గా లక్ష్మణ్ పని చేశారు. కాగా అక్టోబర్ 1న లక్ష్మణ్ నరసింహన్ కంపెనీలో చేరతారని, అయితే 2023 ఏప్రిల్‌లో అధికారం చేపడతారని స్టార్‌బక్స్ తెలిపింది.
అప్పటి వరకు తాత్కాలిక సీఈవో హోవార్డ్ స్కల్జ్ కంపెనీకి నాయకత్వం వహిస్తారు. లక్ష్మణ్ నరసింహన్ ఏప్రిల్ 1 వరకు హోవార్డ్ స్కల్జ్‌తో కలిసి పని చేస్తారు. ఇప్పటివరకు మైక్రోసాఫ్ట్ సీఈఓగా సత్య నాదెళ్ల, అడోబ్ సీఈఓగా శంతను నారాయణ్, గూగుల్ సీఈఓగా సుందర్ పిచాయ్, ట్విట్టర్ సీఈఓ పరాగ్ అగర్వాల్ తదితరులు భారత సంతతికి చెందిన వ్యక్తులు సీఈఓలుగా ఉన్నారు.
లక్ష్మణ్ నరసింహన్ ఎవరు?
లక్ష్మణ్ నరసింహన్ పూణే విశ్వవిద్యాలయం నుండి గ్రాడ్యుయేట్ అయ్యారు. ఆ తర్వాత పెన్సిల్వేనియా విశ్వవిద్యాలయంలోని లాడర్ ఇన్స్టిట్యూట్ నుండి జర్మన్, అంతర్జాతీయ అధ్యయనాలలో మాస్టర్స్ డిగ్రీని పూర్తి చేసారు. అతను పెన్సిల్వేనియా విశ్వవిద్యాలయం వార్టన్ స్కూల్ నుండి బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ డిగ్రీలో మాస్టర్స్ కూడా కలిగి ఉన్నాడు. లక్ష్మణ్ సెప్టెంబర్ 2019లో రెకిట్‌లో చేరాడు. కోవిడ్-19 మహమ్మారి సమయంలో కంపెనీకి మార్గనిర్దేశం చేశాడు. ఇది ఆరోగ్యం, పరిశుభ్రత ఉత్పత్తుల అమ్మకాలను పెంచింది. లాటిన్ అమెరికా, యూరప్, సబ్-సహారా ఆఫ్రికాలో కార్యకలాపాలను కూడా చూసుకున్నాడు.