యాత్రికులతో వెలుతున్న బస్సు ప్రమాదవశాత్తు లోయలో పడిపోయింది. ఈ ఘటనలో 27 మంది యాత్రికులు మృతి చెందారు. ఈ విషాద ఘటన ఇండోనేషియాలో చోటు చేసుకుంది. జావాలో పర్యాటక బస్సు లోయలో పడడంతో 27 మంది యాత్రికులు మృతి చెందారు. మరో 35 మంది గాయపడ్డారు. బస్సు బ్రేకులు ఫెయిల్ కావడంతోనే ఈ ప్రమాదం చోటు చేసుకుందని అధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు. సమాచారం అందుకున్న అధికారులు సహాయక చర్యలు చేపట్టారు.
ఇస్లామిక్ జూనియర్ హైస్కూల్ విద్యార్థులు, వారి తల్లిదండ్రులను జావా ప్రావిన్స్ పట్టణం సుబాంగ్ నుంచి తాసిక్మాలయ జిల్లాలోని ఓ తీర్థయాత్రకు తీసుకెళ్తుండగా బుధవారం అర్ధరాత్రి ప్రమాదం జరిగినట్లు స్థానిక పోలీస్ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. రాత్రి సమయం కావడంతో.. డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో బస్సు సుమారు 65 అడుగుల లోయలోకి దూసుకెళ్లింది. ప్రదామానికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. వాహానానికి బ్రేకులు సరిగా పనిచేయక పోవడంతోనే ఈ ప్రమాదం జరిగినట్లు క్షతగాత్రులు చెబుతున్నారు.
27 మృతదేహాలను వెలికి తీశాం..
బాండుంగ్ సెర్చ్ అండ్ రెస్క్యూ ఏజెన్సీ చీఫ్ దేడెన్ రిద్వాన్సా మాట్లాడుతూ.. ఇప్పటి వరకు ఘటనా స్థలం నుంచి 27 మృతదేహాలను వెలికితీసినట్లు చెప్పారు. అలాగే మరో 35 మంది గాయపడ్డారని వారిని అంబులెన్స్‌లో సమీపంలోని ఆస్పత్రులకు తరలించినట్లు తెలిపారు. మృతుల్లో వాహనం డ్రైవర్ కూడా ఉన్నట్లు పేర్కొన్నారు. ప్రమాదం ఘటన గురించి సమాచారం అందుకున్న వారి బంధువులు, కుటుంబీకులు సుమేడాంగ్ జనరల్ హాస్పిటల్ కిక్కిరిసింది. మృతుల బంధువుల రోదనలు మిన్నంటాయి.