ఇటీవల కాలంలో గనుల్లో వరుస ప్రమాదాలు ప్రజలను భయబ్రాంతులకు గురి చేస్తున్నాయి. ఇండోనేషియాలోని బంగారం గనిలో ఘోర ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఐదుగురు ప్రాణాలు కోల్పోగా.. 70 మంది గల్లంతయ్యారు. వివరాల్లోకి వెళితే.. ఇండోనేషియాలోని సులవేసి సెంట్రల్ లోని మౌంటాంగ్ జిల్లాలోని బురంగా గ్రామంలో బంగారు గని ఉంది. ఈ గనిలో పెద్ద సంఖ్యలో కార్మికులు పని చేస్తున్నారు.
అయితే.. కార్మికులు పని చేస్తున్న సమయంలో కొండ చరియలు విరిగి పడ్డాయి. ఆ సమయంలో గనిలో 75 కార్మికులు విధుల్లో ఉన్నారు. ఈ ఘటనలో ఐదుగురు కార్మికులు అక్కడిక్కడే చనిపోగా.. మరో 70 మంతి గల్లంతయ్యారు. సమాచారం అందుకున్న డిజాస్టర్ టీమ్ రెస్క్యూ ఆపరేషన్ మొదలుపెట్టింది. అయితే.. గల్లంతైన ఆ 70 మంది కూడా ప్రాణాలు కోల్పోయి ఉండొచ్చునని అధికారులు భావిస్తున్నారు. ఇటీవల జరిగిన గని ప్రమాదాల్లో ఇదే అతి పెద్ద ప్రమాదం.