గ్యాస్ కొరత నుంచి ఊరట..హోర్ముజ్ జలసంధిని దాటిన భారత నౌక 'గ్రీన్ ఆశా'

పశ్చిమ ఆసియాలో యుద్ధ ఉద్రిక్తతలు కొనసాగుతున్నప్పటికీ, భారత జెండాతో ప్రయాణిస్తున్న 'గ్రీన్ ఆశా' (Green Asha) అనే ఎల్‌పీజీ నౌక హోర్ముజ్ జలసంధిని సురక్షితంగా దాటింది.

By -  Knakam Karthik
Published on : 5 April 2026 4:40 PM IST

International News, GreenAsha, StraitOfHormuz, MaritimeSecurity, IndiaTrade, LPGTanker, WestAsiaConflict

గ్యాస్ కొరత నుంచి ఊరట..హోర్ముజ్ జలసంధిని దాటిన భారత నౌక 'గ్రీన్ ఆశా'

పశ్చిమ ఆసియాలో యుద్ధ ఉద్రిక్తతలు కొనసాగుతున్నప్పటికీ, భారత జెండాతో ప్రయాణిస్తున్న 'గ్రీన్ ఆశా' (Green Asha) అనే ఎల్‌పీజీ నౌక హోర్ముజ్ జలసంధిని సురక్షితంగా దాటింది. తాజా పరిస్థితుల నేపథ్యంలో ఈ కీలక మార్గం గుండా ప్రయాణించిన తొమ్మిదవ భారతీయ ట్యాంకర్ ఇది. ఫిబ్రవరి 28న జరిగిన దాడుల తర్వాత ఈ ప్రాంతంలో భద్రతాపరమైన ముప్పు పెరిగినప్పటికీ, భారత్ తన ఇంధన అవసరాల కోసం ఈ మార్గాన్ని సమర్థవంతంగా వాడుకుంటోంది.

గ్రీన్ ఆశా కంటే ముందే BW TYR, BW ELM, పైన్ గ్యాస్, జగ్‌ వసంత్, ఎంటీ శివాలిక్, ఎంటీ నందా దేవి వంటి నౌకలు లక్షల టన్నుల గ్యాస్‌ను గుజరాత్‌లోని రేవులకు చేరవేశాయి. కేవలం ఎల్‌పీజీ మాత్రమే కాకుండా ముడి చమురు, గ్యాసోలిన్ వంటి ఇంధనాలను కూడా భారత నౌకలు విజయవంతంగా రవాణా చేశాయి. ప్రపంచ ఇంధన సరఫరాకు అత్యంత కీలకమైన ఈ జలసంధిలో సవాళ్లు ఉన్నప్పటికీ, భారత షిప్పింగ్ కార్యకలాపాలు చురుగ్గా సాగుతున్నాయి.

Next Story