ఒమన్‌లోని మస్కట్ తీరంలో జరిగిన ఘోర ప్రమాదంలో ఒక భారతీయుడు మృతి చెందాడు. సోమవారం మస్కట్ తీరానికి 52 నాటికల్ మైళ్ల దూరంలో ప్రయాణిస్తున్న 'MKD VYOM' అనే చమురు ట్యాంకర్‌ను పేలుడు పదార్థాలతో ఉన్న ఒక రిమోట్ కంట్రోల్ బోటు (Unmanned boat) ఢీకొట్టింది. ఈ దాడి కారణంగా ట్యాంకర్ ఇంజిన్ రూమ్‌లో భారీ పేలుడు సంభవించి మంటలు చెలరేగాయి.
ఈ ప్రమాదంలో ఒక భారతీయ సిబ్బంది ప్రాణాలు కోల్పోగా, మిగిలిన 21 మందిని (16 మంది భారతీయులు, నలుగురు బంగ్లాదేశీయులు, ఒక ఉక్రేనియన్) సురక్షితంగా తరలించారు. అంతకుముందు రోజు కూడా హార్ముజ్ జలసంధిలో 'MV Skylight' అనే మరో ట్యాంకర్‌పై దాడి జరిగింది. ఈ ఘటనల నేపథ్యంలో ఒమన్‌లోని భారత రాయబార కార్యాలయం స్థానిక అధికారులతో సంప్రదింపులు జరుపుతోంది. బాధితులకు అవసరమైన అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తున్నట్లు భారత ఎంబసీ వెల్లడించింది.