కబడ్డీ ఆడిన భారత్-అమెరికా సైనికులు

India us soldiers play kabaddi. అలస్కా: 'ఐస్ బ్రేకింగ్ యాక్టివిటీస్' లో భాగంగా భారత్-అమెరికా సైనికులు పలు గేమ్స్ ను ఆడారు. భారత మరియు అమెరికన్ సైనికులు

By అంజి  Published on  17 Oct 2021 11:15 AM GMT
కబడ్డీ ఆడిన భారత్-అమెరికా సైనికులు

అలస్కా: 'ఐస్ బ్రేకింగ్ యాక్టివిటీస్' లో భాగంగా భారత్-అమెరికా సైనికులు పలు గేమ్స్ ను ఆడారు. భారత మరియు అమెరికన్ సైనికులు శనివారం నాడు కబడ్డీ, అమెరికన్ ఫుట్‌బాల్, సాకర్ మరియు వాలీబాల్ కు సంబంధించి స్నేహపూర్వక మ్యాచ్‌లు ఆడారు. రెండు దేశాల సైనికులతో కూడిన నాలుగు జట్లు నిజమైన క్రీడాస్ఫూర్తితో అనేక స్నేహపూర్వక మ్యాచ్‌లు ఆడినట్లు భారత సైన్యం తెలిపింది. ఇరు దేశాలకు సంబంధించిన గేమ్స్ గురించి తెలుసుకున్నారు. అమెరికన్ ఫుట్‌బాల్‌లో భారత సైనికులు తమ వంతు ప్రయత్నాన్ని చేశారు, యుఎస్ దళాలు కబడ్డీలో ఉత్సాహంతో పాల్గొన్నాయి.

ఈ క్రీడా కార్యకలాపాలు దళాలు ఒకరినొకరు దగ్గరగా తెలుసుకోవడానికి వీలు కల్పించాయి. ఇది రాబోయే కార్యకలాపాలకు మరింత సహాయ పడతాయని భారత్ ఆర్మీ తెలిపింది. శుక్రవారం అమెరికా-అలస్కాలోని జాయింట్ బేస్ ఎల్‌మెండోర్ఫ్ రిచర్డ్‌సన్‌లో ప్రారంభమైన ఇండియా-యుఎస్ సంయుక్త శిక్షణా కార్యక్రమం "ఎక్స్ యుద్ అభ్యాస్ 21" 17 వ ఎడిషన్ లో భాగంగా ఈ కార్యక్రమాలు ​​జరిగాయి. 14 రోజుల వ్యాయామంలో ఐక్యరాజ్యసమితి ఆదేశం ప్రకారం కార్యకలాపాల కోసం ఉమ్మడి శిక్షణ ఉంటుందని భారత సైన్యం తెలిపింది. 300 మంది US ఆర్మీ సైనికులు, 7 మద్రాస్ ఇన్ఫాంట్రీ బెటాలియన్ గ్రూప్ ఆఫ్ ఇండియన్ ఆర్మీకి చెందిన 350 మంది సైనికులు ఈ శిక్షణా కార్యక్రమంలో పాల్గొంటున్నారు.



Next Story