కష్టకాలంలో ఇరాన్‌కు అండగా నిలిచిన భారత్..తొలి విడత వైద్య సాయం అందజేత

అమెరికా, ఇజ్రాయెల్ దాడుల వల్ల తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయిన ఇరాన్‌కు భారత్ తన మానవతా దృక్పథాన్ని చాటుకుంది.

By -  Knakam Karthik
Published on : 18 March 2026 2:27 PM IST

International News, India Iran Relations, Humanitarian Aid, Medical Assistance, Iran Crisis, Iran War Updates, Indian Relief

కష్టకాలంలో ఇరాన్‌కు అండగా నిలిచిన భారత్..తొలి విడత వైద్య సాయం అందజేత

అమెరికా, ఇజ్రాయెల్ దాడుల వల్ల తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయిన ఇరాన్‌కు భారత్ తన మానవతా దృక్పథాన్ని చాటుకుంది. యుద్ధం కారణంగా మందుల కొరతతో ఇబ్బంది పడుతున్న ఆ దేశానికి అత్యవసర వైద్య సామాగ్రితో కూడిన తొలి విడత సాయాన్ని పంపింది. ఈ సహాయం తమకు అందినట్లు ఇరాన్ ప్రభుత్వం అధికారికంగా ధ్రువీకరించడమే కాకుండా, కష్టకాలంలో అండగా నిలిచిన భారత ప్రభుత్వానికి, ప్రజలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపింది. ఫిబ్రవరి 28 నుంచి సాగుతున్న దాడులతో ఇరాన్‌లో వేలాది మంది గాయపడటం, ఆసుపత్రుల్లో మందుల కొరత ఏర్పడటంతో భారత్ ఈ నిర్ణయం తీసుకుంది.

న్యూఢిల్లీలోని ఇరాన్ రాయబార కార్యాలయం సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ, భారత ప్రజలు పంపిన ఈ సాయాన్ని 'ఇరానియన్ రెడ్ క్రెసెంట్ సొసైటీ' అందుకుందని వెల్లడించింది. ఇప్పటికే ఇరాన్‌కు సాయం అందించే విషయంపై చర్చలు జరుపుతున్నట్లు ప్రకటించిన భారత విదేశాంగ శాఖ, ఆ దిశగా వేగంగా అడుగులు వేసి సాయాన్ని చేరవేసింది. భారత్‌తో పాటు చైనా, రష్యా, అజర్‌బైజాన్ వంటి దేశాలు కూడా ఇరాన్‌కు సహాయం అందిస్తుండగా, యుద్ధ ప్రాంతాల్లో చిక్కుకున్న భారతీయులను సురక్షితంగా వెనక్కి తీసుకువచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తోంది.

Next Story