249 మంది పాకిస్థానీ యాత్రికులకు భారత్ వీసా జారీ

India issues visa to 249 Pakistani pilgrims to visit Ajmer Sharif. ఇస్లామాబాద్: రాజస్థాన్‌లోని అజ్మీర్‌లోని సూఫీ సెయింట్ మొయినుద్దీన్ చిస్తీ సమాధిని సందర్శించేందుకు

By అంజి
Published on : 23 Jan 2023 8:32 AM IST

249 మంది పాకిస్థానీ యాత్రికులకు భారత్ వీసా జారీ

ఇస్లామాబాద్: రాజస్థాన్‌లోని అజ్మీర్‌లోని సూఫీ సెయింట్ మొయినుద్దీన్ చిస్తీ సమాధిని సందర్శించేందుకు 249 మంది పాకిస్థానీ యాత్రికులకు భారత్ వీసాలు మంజూరు చేసినట్లు ఆదివారం ఒక అధికారి తెలిపారు. మినిస్ట్రీ ఆఫ్ రిలీజియస్ అఫైర్స్ అండ్ ఇంటర్‌ఫెయిత్ హార్మొనీ ప్రతినిధిని చెప్పిన వివరాల ప్రకారం.. 488 మంది దరఖాస్తుదారులు వీసాల కోసం దరఖాస్తు చేసుకున్నారని, అయితే 249 మంది యాత్రికులకు మాత్రమే వీసాలు మంజూరయ్యాయని ప్రభుత్వ రేడియో పాకిస్తాన్ తెలిపింది.

యాత్రికులందరూ లాహోర్‌కు చేరుకోవాలని అక్కడి నుంచి మంగళవారం భారత్‌కు యాత్రకు బయలుదేరనున్నట్లు సమాచారం అని ప్రతినిధి తెలిపారు. యాత్రికులు భారతదేశంలో ఉన్న సమయంలో వారి సంరక్షణ కోసం ఆరుగురు అధికారులను నియమించినట్లు ఆయన చెప్పారు. అయితే, వారిలో ఒకరికి మాత్రమే యాత్రికులతో వెళ్లేందుకు అనుమతి లభించిందని ఆయన తెలిపారు. 1974 సెప్టెంబర్‌లో భారతదేశం, పాకిస్తాన్ సంతకం చేసిన మతపరమైన పుణ్యక్షేత్రాల సందర్శనల ప్రోటోకాల్ ప్రకారం రెండు కౌంటీలు యాత్రికులను అనుమతిస్తున్నాయి. అయితే, వివిధ కారణాలపై రెండు వైపులా యాత్రికుల వీసాలను తిరస్కరిస్తున్నట్లు కనిపిస్తోంది.

Next Story