మూడో పెళ్లి చేసుకున్న ఇమ్రాన్‌ఖాన్‌ మాజీ భార్య.. వరుడికి కూడా మూడో పెళ్లే

Imran Khan's ex-wife gets married for 3rd time. పాకిస్థాన్ మాజీ ప్రధాని, పీటీఐ పార్టీ అధినేత ఇమ్రాన్ ఖాన్ మాజీ భార్య, పాకిస్థాన్-బ్రిటీష్ జర్నలిస్ట్ రెహమ్

By అంజి  Published on  23 Dec 2022 9:31 AM GMT
మూడో పెళ్లి చేసుకున్న ఇమ్రాన్‌ఖాన్‌ మాజీ భార్య.. వరుడికి కూడా మూడో పెళ్లే

పాకిస్థాన్ మాజీ ప్రధాని, పీటీఐ పార్టీ అధినేత ఇమ్రాన్ ఖాన్ మాజీ భార్య, పాకిస్థాన్-బ్రిటీష్ జర్నలిస్ట్ రెహమ్ ఖాన్ మూడో పెళ్లి చేసుకున్నారు. మీర్జా బిలాల్ అనే వ్యక్తిని రెహమ్ ఖాన్ మూడో వివాహం చేసుకున్నారు. రెహమ్ ఖాన్ 2015లో ఇమ్రాన్ ఖాన్ నుంచి విడాకులు తీసుకున్నారు. పాకిస్తానీ మీడియా రిపోర్ట్స్‌ ప్రకారం.. రెహమ్ ఖాన్ భర్త మీర్జా బిలాల్ పాకిస్తాన్ మూలానికి చెందినవాడు. కానీ ప్రస్తుతం అమెరికాలో నివసిస్తున్నారు. మీర్జా బిలాల్ వయస్సు 36 సంవత్సరాలు. అతను ప్రస్తుతం కార్పొరేట్‌ ప్రొఫెషనల్‌గా ఉన్నాడు. బిలాల్‌.. ఇది వరకు మోడలింగ్‌ కూడా చేశాడు. రెహమ్, బిలాల్ వివాహం అమెరికాలో సాధారణంగా జరిగింది.

రెహమ్ ఖాన్ లాగే మీర్జా బిలాల్ కూడా ఇంతకు ముందు రెండు పెళ్లిళ్లు చేసుకున్నారు. మీర్జా బిలాల్ ఒక బిడ్డకు తండ్రి కూడా. రెహమ్‌, మీర్జా బిలాల్‌ వివాహం అమెరికాలో సాధారణ వేడుకలో జరిగింది. రెహమ్ ఖాన్ తన పెళ్లి ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. రెహమ్ ఖాన్ ట్విట్టర్‌లో మీర్జా బిలాల్‌తో కలిసి ఉన్న ఫోటోను పంచుకోవడం ద్వారా తన వివాహం గురించి సమాచారం ఇచ్చింది. ఫోటోను షేర్ చేస్తూ.. రెహమ్ ఖాన్ క్యాప్షన్‌లో ఇలా రాశారు. ''చివరిగా నేను విశ్వసించగల వ్యక్తిని కనుగొన్నాను'' అని.

రెహమ్ ఖాన్ ఇజాజ్ రెహ్మాన్‌తో మొదటిసారి వివాహం చేసుకున్నారు. అయితే వీరి వివాహం కుదరకపోవడంతో 2005లో ఇద్దరూ విడాకులు తీసుకున్నారు. దీని తరువాత, 2014 సంవత్సరంలో.. రెహమ్ ఖాన్ పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌ను వివాహం చేసుకున్నారు. అయితే, ఇమ్రాన్ ఖాన్‌తో రెహమ్ వైవాహిక జీవితం ఎక్కువ కాలం కొనసాగలేదు. వారిద్దరూ 2015 సంవత్సరంలోనే విడాకులు తీసుకున్నారు. రెహమ్ ఖాన్ రెండు వివాహాలు పూర్తిగా విఫలమయ్యాయి. అయినప్పటికీ మూడవ వివాహంలో తనకు మంచి జీవిత భాగస్వామి లభిస్తుందని ఆమె పూర్తి ఆశతో ఉంది. ఈ కారణంగా, రెహమ్ ఖాన్ రెండు విడాకుల తర్వాత కూడా పెళ్లికి నిరాకరించలేదు. గత జులైలో కూడా పాకిస్థానీ యూట్యూబ్ షోలో రెహమ్ ఖాన్ మరోసారి పెళ్లి చేసుకోవడానికి సిద్ధమని చెప్పింది.

మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌ను వివాహం చేసుకున్న తర్వాత రెహమ్ ఖాన్ వెలుగులోకి వచ్చింది. అయితే, ఆ సమయంలో ఇమ్రాన్ ఖాన్ పాకిస్థాన్ అధికారాన్ని చేజిక్కించుకోలేదు. రెహమ్ ఖాన్ 1973 ఏప్రిల్ 3న లిబియాలో జన్మించారు. ప్రస్తుతం రెహమ్ ఖాన్ వయస్సు 49 సంవత్సరాలు. ఆమె జర్నలిస్ట్, వ్యాఖ్యాత కూడా. దీనితో పాటు రెహమ్ ఖాన్ కూడా ప్రముఖ రచయిత, చిత్రనిర్మాతగా పని చేసింది. రెహమ్ ఖాన్ పెషావర్ జిన్నా కళాశాల నుండి బ్యాచిలర్ డిగ్రీని తీసుకున్నారు. 2006 సంవత్సరంలో ఆమె టీవీ హోస్ట్‌గా తన వృత్తిని ప్రారంభించారు. అదే సంవత్సరంలో రెహమ్ ఖాన్ బ్రిటన్ సన్‌షైన్ రేడియో స్టేషన్‌లో పని చేయడం ప్రారంభించారు. 2008లో బీబీసీలో ఉద్యోగం ప్రారంభించారు. ఆ తర్వాత 2015 సంవత్సరంలో, ఆమె డాన్ న్యూస్‌తో రెహమ్ ఖాన్ షో చేయడం ప్రారంభించారు.

Next Story