రోబో సోఫియా చెల్లెలు రోబో గ్రేస్ ఆవిర్భవించబోతుంది..!
Humanoid Robot Sophia Sister Coming Soon. రోబో సోఫియా చెల్లెలు రోబో గ్రేస్ ఆవిర్భవించబోతుంది.
By Medi Samrat Published on 27 Jan 2021 7:22 AM GMTరజనీకాంత్ నటించిన రోబో సినిమాలో రోబో చకచకా పనులు చేస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తూ ఉంటాడు. ఆ సమయంలో ఇలాంటి రోబోలు నిజంగానే ఉంటే ఎంతో బాగుంటుందని అనిపించింది. ప్రస్తుతం ప్రపంచంలోనే తొలి రోబోగా మానవ కాంత సోఫియా ఆవిర్భవించింది. హాలీవుడ్ నటి ఆడ్రీ హెబ్బన్‌నీ, సోఫియా ప్రతి రూపం గానే ఆమె పోలికలతో రోబో సోఫియాను ఆవిష్కరించారు. ఈ రోబో సోఫియా పలు దేశాలలో పర్యటించి పలు సదస్సులలో పాల్గొంది. మనం అడిగే ఎలాంటి ప్రశ్నలకైనా చకచకా సమాధానాలు చెబుతూ అందరినీ ఆశ్చర్యపరుస్తూ ఉంటుంది. అదే విధంగా మనిషి చేయగలిగే అన్ని పనులను చేస్తూ ఎంతో గుర్తింపు తెచ్చుకున్న సోఫియా.. మాదిరే తన చెల్లెలు లాంటి గ్రేస్ రోబోని కూడా ఆవిష్కరించే ప్రయత్నంలో ఉన్నారు.
.
2021వ సంవత్సరంలో వివిధ రంగాలలో ఉత్తమమైన సేవలను అందించడానికి సోఫియా చెల్లెలు గ్రేస్ తో పాటు, సోఫియా ప్రతి రూపాలు కూడా కొన్ని వేల సంఖ్యలో ఆవిర్భవించనున్నాయి. సోఫియాకు ఎలాంటి ప్రత్యేకతలు ఉంటాయో, గ్రేస్ కూడా అలాంటి ప్రత్యేకతలతో రూపు దిద్దుకొంది. అయితే గ్రేస్ మాత్రం సామాజిక సేవ చేయడం కాకుండా. తనను రూపొందించిన రోబో కంపెనీ గ్రేస్ రోబోలను కేవలం వైద్య సేవలకు మాత్రమే పరిమితం చేయనున్నారు.
మనుషులలో జ్ఞానేంద్రియాలు ఉన్నట్టు సోఫియాకు కూడా నాలుగు శక్తులు ఉన్నాయి.1) కృత్రిమ మేధోశక్తి (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్).2) దృశ్య సమాచార విశ్లేషణ (విజువల్ డేటా ప్రాసెసింగ్).3) ముఖాన్ని పోల్చుకునే జీవభౌతిక సాంకేతికత (ఫేషియల్ రికగ్నిషన్). 4)గొంతు గుర్తుపట్టడం (వాయిస్ రికగ్నిషన్). ఈ నాలుగు శక్తుల ద్వారా రోబో సోఫియా చూస్తుంది, వింటుంది, మాట్లాడుతుంది, ఆలోచన చేస్తుంది. మనుషులు ఏ విధంగా అయితే ప్రవర్తిస్తారు రోబోలు కూడా అదేవిధంగా ప్రవర్తనను కలిగి ఉంటాయి.అయితే తొందరలోనే మరికొన్నిటిని వేలసంఖ్యలో రోబోలు ఈ లోకం పై సృష్టించడంతో అన్ని రంగాలలో వివిధ సేవలను అందించడంలో సహాయపడతాయని చెప్పవచ్చు. తొందరలోనే సోఫియా చెల్లెలు గ్రేస్ రోబో కూడా ఆవిర్భావం కావడంతో వైద్య రంగంలో సేవలు అందించడానికి ఈ రోబోలు సహకరిస్తాయని చెప్పవచ్చు.