పాక్ సంచలన ప్రకటన: అక్కడ హిందూ దేవాలయాలను నిర్మిస్తాం..!

Hindu Temple Built In Pakistan. పాకిస్తాన్, వారి దేశంలో స్వయంగా హిందూ దేవాలయాన్ని నిర్మిస్తామనే సంచలన వ్యాఖ్యలు చేసింది. హిందూ ఆలయాన్ని ధ్వంసం చేసిన ఘటన ఫై వత్తిడి తెచ్చ్చినందుకు.

By Medi Samrat
Published on : 3 Jan 2021 7:00 AM IST

pakistan flag

శత్రు దేశమైన పాకిస్థాన్ భారతదేశం పై విరుచుకు పడటానికి ముందు స్థానంలో ఉంటుంది. అలాంటి పాకిస్తాన్, వారి దేశంలో స్వయంగా హిందూ దేవాలయాన్ని నిర్మిస్తామనే సంచలన వ్యాఖ్యలు చేసింది. పాక్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడానికి గల కారణం ఏమిటంటే...ఇటీవల కాలంలో పాకిస్తాన్ లోని ముస్లిం మతస్తులు PakistanHindu సంగతి తెలిసిందే. అయితే ఈ ఘటనపై తీవ్ర స్థాయిలో నిరసనలు వ్యక్తం అవడంతో పాటు, ఇండియా నుంచి అధిక ఒత్తిడి ఏర్పడటం వల్ల వీలైనంత తొందరలో ఆ దేవాలయాన్ని పునర్నిర్మాణం చేయనున్నట్లు కైబర్ పక్తూన్‌క్వా ముఖ్యమంత్రి మహ్మద్ ఖాన్ శుక్రవారం ప్రకటించారు.

మహ్మద్ ఖాన్ ఆదేశాలు జారీ చేయడంతో పాటు వీలైనంత తొందరగా ఆ దేవాలయాన్ని నిర్మిస్తున్నట్లు ఆయన తెలిపారు. పూర్తి వివరాల్లోకి వెళితే..పాకిస్థాన్‌లోని కైబర్ పక్తూన్‌క్వాలోని, కరక్ జిల్లా, తేరి గ్రామంలో బుధవారం హిందూ దేవాలయాన్ని ముస్లిం మతస్తులతో కలిసి తీవ్ర విధ్వంసం సృష్టించారు. ముస్లిం మత సంస్థల ఆధ్వర్యంలో తేరీ గ్రామంలో ఉన్న

శ్రీ పరమహంసజీ మహరాజ్ సమాధిని, కృష్ణ ద్వార మందిరాన్ని స్థానిక ముస్లింలు ధ్వంసం చేశారు. ఈ ఘటనపై మానవ హక్కుల సంఘాలు, హిందూ సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. అంతేకాకుండా ఈ విషయాన్ని స్థానిక చీఫ్ జస్టిస్ గుల్జార్ అహ్మద్‌కు ఆ దేశంలోని మైనారిటీ ప్రజా ప్రతినిధి రమేశ్ కుమార్ తెలియజేశారు.

పాకిస్తాన్ లో ఈ విధ్వంసానికి పాల్పడిన 26 మంది నిందితులతో పాటు ఉలేమా ఏ ఇస్లామ్‌ నేత రెహ్మత్ సలామ్ ఖట్టక్‌ను అరెస్ట్ చేసినట్లు కైబర్ పక్తూన్‌క్వా పోలీస్ బాస్ కేపీకే నసాఉల్లా అబ్బాసి తెలిపారు. వీరే కాకుండా మరో 350 మందిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు తెలిపారు. ఈ విషయంపై పాక్ సుప్రీంకోర్టు స్థానిక అధికారులను ఆరా తీసింది. జనవరి 5వ తేదీన ఈ విషయంపై విచారణ జరపడానికి కోర్టు ఆదేశాలను జారీ చేసింది.


Next Story