గుడిని విడిచి రాను.. తాలిబ‌న్లు చంపినా స‌రే.. తేల్చి చెప్పిన హిందూ పూజారి

Hindu Priest at a temple in Kabul refuses to leave Afghanistan.అఫ్గనిస్థాన్‌ నుంచి అమెరికా సైనిక బలాల ఉపసంహరణ

By తోట‌ వంశీ కుమార్‌  Published on  18 Aug 2021 3:51 AM GMT
గుడిని విడిచి రాను.. తాలిబ‌న్లు చంపినా స‌రే.. తేల్చి చెప్పిన హిందూ పూజారి

అఫ్గనిస్థాన్‌ నుంచి అమెరికా సైనిక బలాల ఉపసంహరణ నిర్ణ‌యం త‌రువాత నుంచి అఫ్గనిస్థాన్‌ దేశంలో ప‌రిస్థితులు చాలా వేగంగా మారిపోయాయి. తాలిబ‌న్లు ఒక్కొ ప్రాంతాన్ని ఆక్ర‌మిస్తూ దేశ రాజ‌ధాని కాబుల్‌ను హ‌స్త‌గ‌తం చేసుకున్న సంగ‌తి తెలిసిందే. అఫ్గాన్ తాలిబ‌న్ల వ‌శ‌మ‌వ‌డంతో అక్కడి ప్ర‌జ‌లు తీవ్ర ఆందోళ‌న చెందుతున్నారు. గ‌తంలోలాగా మ‌ళ్లీ చీక‌టి రోజులు త‌ప్ప‌వ‌ని భీతిల్లుతున్నారు. ప్ర‌జ‌లు దేశం విడిచి పారిపోయేందుకు విమానాశ్ర‌యాల‌కు పోటెత్తుతున్నారు. కిక్కిరిసిపోయిన విమానాల్లో ప్ర‌యాణించేందుకు ఎగ‌బ‌డుతున్నారు. కొంద‌రు విమానం పై భాగం ఎక్కి అత్యంత ప్ర‌మాద‌క‌ర ప‌రిస్థితుల్లో ప్ర‌యాణం చేస్తూ.. ప్రాణాలు పొగొట్టుకుంటున్నారు.

ఏదైతే అది అయ్యింది కానీ.. దేశం విడిచి వెళ్లాల‌ని చాలా మంది బావిస్తున్నారు. అయితే.. ఓ హిందూ పూజారి మాత్రం ఆఫ్ఘనిస్థాన్ దాటి రావ‌డానికి స‌సేమిరా అంటున్నాడు. ఆఫ్గాన్‌ను వ‌దిలి వెళ్లేందుకు అవ‌కాశం వ‌చ్చినా తిర‌స్క‌రించారు. ఆయన పేరు పండిట్ రాజేష్ కుమార్. కాబూల్‌లోని రత్తన్ నాథ్ ఆలయంలో పూజారిగా పనిచేస్తున్నారు. తన పూర్వీకుల నుంచి సంర‌క్షిస్తూ.. వస్తున్న ఈ ఆలయాన్ని వదిలి తాను రావడం జరగదని రాజేష్ కుమార్ స్పష్టం చేశారు. కొంతమంది హిందువులు ఆయన్ను దేశం దాటించి, సాయం చేస్తామని చెప్పినా ఆయన నిరాకరించారట.

త‌న పూర్వీకులు వందల ఏళ్లుగా ఈ మందిరాన్ని సంర‌క్షిస్తూ వ‌చ్చార‌ని, అలాంటి గుడిని తాను ఇప్పుడు విడిచిపెట్ట‌లేన‌ని అంటున్నారు. ఒక‌వేళ తాలిబ‌న్లు త‌న‌ను చంపేసినా.. దాన్ని సేవ‌గానే బావిస్తాన‌ని చెప్పారు. ఆ గుడికి వ‌చ్చే కొద్ది మంది హిందువులు త‌మ‌తో పాటు వ‌చ్చేయాల‌ని కోరగా.. తాను తిర‌స్క‌రించిన‌ట్లు రాజేశ్ తెలిపారు. ఈ పూజారి కథను భరద్వాజ్ అనే ట్విట్టర్ యూజర్ సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఈ కథనంతోపాటు ఆ ఆలయానికి సంబంధించిన పాత వీడియోను కూడా షేర్ చేశారు. ప్ర‌తికూల ప‌రిస్థితుల్లో ఆయ‌న చూపిస్తున్న విధేయ‌త, దైవ‌భ‌క్తి ప‌ట్ల ప‌లువురు ఆశ్చ‌ర్యం వ్య‌క్తం చేయ‌గా.. నెటిజ‌న్లు త‌మ‌దైన శైలిలో కామెంట్లు పెడుతున్నారు.

Next Story