ఈ దేశాల్లోనే వృద్ధ జనాభా ఎక్కువ.. 2100 నాటికి మాత్రం..

ప్రపంచ జనాభాలో దాదాపు 10 శాతం వయోధికులే. 65 ఏళ్లు పైబడిన వారి సంఖ్య 2022 నాటికి 771 మిలియన్లకు చేరింది.

By అంజి  Published on  3 Jun 2023 2:15 PM IST
elderly population, countries, Internationalnews

ఈ దేశాల్లోనే వృద్ధ జనాభా ఎక్కువ.. 2100 నాటికి మాత్రం..

ప్రపంచ జనాభాలో దాదాపు 10 శాతం వయోధికులే. 65 ఏళ్లు పైబడిన వారి సంఖ్య 2022 నాటికి 771 మిలియన్లకు చేరింది. 2050 నాటికి 16 శాతం సీనియర్‌ సిటిజన్లే ఉంటారని అంచనా. అత్యధిక ఆదాయం కలిగిన దేశాల్లో సీనియర్‌ సిటిజన్ల శాతం ఎక్కువగా ఉంది. జపాన్‌లో వయోధికులు 30 శాతం, ఇటలీలో 24 శాతం, ఫిన్లాండ్‌లో 23 శాతంగా ఉన్నారు. ఇక పశ్చిమాసియా, ఆఫ్రికా దేశాల్లో వీరి సంఖ్య తక్కువే. ఖతర్‌, ఉగండా, ఆప్ఘానిస్తాన్‌ తదితర దేశాల్లో 2 శాతం మేరే ఉండటం గమనార్హం.

కాలక్రమంలో దాదాపు అన్ని దేశాల్లో సీనియర్‌ సిటిజన్ల సంఖ్య పెరిగే అవకాశాలు ఉన్నాయి. వచ్చే 3 దశాబ్దాల్లో ఐరోపా, ఉత్తర అమెరికా, ఆసియా దేశాల్లో ప్రతి నలుగురిలో ఒకరు 65 ఏళ్లుపై బడిన వారే ఉంటారని అంచనా. 2100 నాటికి పలు ఆసియా దేశాలు, ద్వీప దేశాల్లో జనాభా పెరుగుదల రేటు అత్యల్పంగా ఉంటుంది. దీని వల్ల 65 ఏళ్ల వయస్సున్న వారి జనాభా మూడో వంతుకు చేరుతుందని అంచనా. దక్షిణ కొరియా, జమైకాల్లో ఇది 44 శాతం వరకు ఉండొచ్చు. 2100 నాటికి అత్యధిక సంఖ్యలో వృద్ధులు ఉన్న దేశంగా అల్బేనియా రికార్డులకు ఎక్కనుంది. అక్కడ వయోధికులు ఏకంగా 49 శాతానికి చేరతారని అంచనా.

Next Story