వీసా లేకుండా భారతీయులు ఎప్పుడైనా వెళ్ళగలిగే దేశాలు ఇవే

విదేశాలకు వెళ్లాంటే వీసా తప్పనిసరి. దీనికి ఎంతో తతంగం కూడా ఉంటుంది. అయితే.. వీసాతో పని లేకుండా హాయిగా మా దేశం రమ్మని, ఇ

By అంజి  Published on  11 Jun 2023 11:24 AM IST
countries, Indians, visiting, visa, international news

వీసా లేకుండా భారతీయులు ఎప్పుడైనా వెళ్ళగలిగే దేశాలు ఇవే

విదేశాలకు వెళ్లాంటే వీసా తప్పనిసరి. దీనికి ఎంతో తతంగం కూడా ఉంటుంది. అయితే.. వీసాతో పని లేకుండా హాయిగా మా దేశం రమ్మని, ఇక్కడే ఉండమని కోరే దేశాలూ ఉన్నాయి. మన పొరుగు దేశాలైన నేపాల్‌, భూటాన్‌, శ్రీలంకతో పాటు మరెన్నో దేశాలు ఈ జాబితాలో ఉన్నాయి. ఆ దేశాలు, అక్కడి నియమాలేమిటో ఓసారి చూద్దాం.. నచ్చితే సరదాగా వాటిని చూట్టేసి రండి.

కుక్‌ ఐలాండ్స్‌: మౌరీ బీచ్‌, కొబ్బరి తోటలు, బీచ్‌లు ఇక్కడ ప్రత్యేకం. ఈ దేశానికి వీసా అక్కర్లేదు. ఇక్కడ 31 రోజుల పాటు ఉండొచ్చు

పిట్కైర్న్ ఐలాండ్స్‌: ఇక్కడ చిన్న చిన్న ద్వీపాలు ఉంటాయి. ఇక్కడ సాహస క్రీడలు సాధన చేస్తుంటారు. ఈ దేశంలో 14 రోజుల పాటు ఉండేవారికి వీసా అవసరం లేదు.

సోమాలియా: ఇక్కడి మసీదులు ప్రపంచంలోనే ప్రత్యేకం. ఈ దేశానికి చేరుకోగానే వీసా ఇస్తారు. ఇక్కడికి వెళ్లడానికి రెండ్రోజుల ముందుగానే మిమ్మల్ని ఆహ్వానించిన వారు అక్కడి ఎయిర్‌పోర్టులో అప్లికేషన్‌ సమర్పించాల్సి ఉంటుంది.

పలావ్‌: జెల్లీ ఫిష్‌ లేక్‌, బెలావ్‌ నేషన్‌ మ్యూజియం ఇక్కడ ఫేమస్‌ పర్యాటక ప్రాంతాలు. ఈ దేశానికి వెళ్లగానే 30 రోజులకు వీసా ఇస్తారు.

సీషెల్స్‌: ఇక్కడ వందకుపైగా దీవులు ఉన్నాయి. వీటి మధ్య జనావాసాలు ఏర్పాటు చేసుకుని ప్రజలు జీవనం సాగిస్తుంటారు. సముద్రపు ఉత్పత్తులే ప్రధాన ఆహారం. ఈ దేశానికి వెళ్లగానే 30 రోజులకు అనుమతి ఇస్తారు.

హైతీ: ఇక్కడ రంగురంగుల ఇళ్లు, కొయకే బీచ్‌ ఇలా ఆకట్టుకునే ప్రదేశాలు చాలానే ఉన్నాయి. ఈ దేశంలో వీసా లేకుండా మూడు నెలలు ఉండొచ్చు.

గునియా బిస్సవ్‌: తక్కువ జనాభా గల ఈ దేశంలో ఉద్యానవనాలు, ఓడరేవులు, పార్కులు పుష్కలంగా ఉన్నాయి. ఈ దేశానికి వెళ్లగానే 90 రోజులకు వీసా ఇస్తారు.

డామినికా: చెట్లపై రిసార్లు, నదీ తీరాలను ఆనుకుని ఉండే ఊళ్లు ఇక్కడ ప్రత్యేకం. ఈ దేశానికి వెళ్లగానే 6 నెలలకు వీసా ఇస్తారు.

నౌరూ: వెండిని ఎగజిమ్మినట్లు ఇసుక, నీలం రంగు కలిపిన నీళ్లతో బీచ్‌లు ఇక్కడ ఆకట్టుకుంటాయి. ఈ దేశానికి చేరిన తర్వాత వీసా పొందవచ్చు. గడువు లేదు.

జమైకా: ప్రసిద్ధ గాయకుడు జమైకా రెగె జన్మస్థలం. ఇక్కడ నీటి మధ్యలో ఇళ్లు కట్టుకుని జీవిస్తుంటారు. ఈ దేశానికి వీసా అక్కర్లేదు. గడువు కూడా లేదు.

Next Story