రష్యాలో ఘోర ప్రమాదం జరిగింది. పర్యాటకులతో వెలుతున్న ఎంఐ-8 హెలికాఫ్టర్ ఈ రోజు తెల్లవారుజామున కుప్పకూలింది. ఆ దేశ తూర్పు ప్రాంతంలోని కమ్చట్కా ద్వీపకల్పంలో ఉన్న సరస్సులో హెలికాప్టర్ కూలినట్లు అధికారులు పేర్కొన్నారు. ఘటన జరిగిన 13 మంది ప్రయాణీకులతో పాటు ముగ్గురు సిబ్బంది కలిపి మొత్తం 16 మంది ఆ హెలికాఫ్టర్‌లో ఉన్నారు. సెయింట్ పీటర్స్‌బర్గ్ నుండి అగ్నిపర్వతం చూడడానికి (సైట్ సీయింగ్) వెలుతుండగా ఈ ఘటన జరిగింది.
సమాచారం అందుకున్న వెంటనే అధికారులు 40మందితో కూడిన రెస్క్యూ బృందాలు, గజ ఈతగాళ్లను అక్కడికి పంపించి సహాయక చర్యలు చేపట్టారు. ఇప్పటి వరకు తొమ్మిది మందిని సహాయక సిబ్బంది కాపాడారు. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. మిగిలిన ఏడుగురిని గుర్తిచేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. కాగా.. ఈ ఘటనపై విచారణ చేపట్టినట్లు వాయు ప్రమాద విచారణ రష్యన్ దర్యాప్తు కమిటీ తెలిపింది. క్షేమంగా ఉన్నావారిని ఖోడుట్కాకు తరలించారు.
కమ్చట్కా చాలా తక్కువ మంది జనాభా నివసించే పెద్ద భూభాగం. ఇక్కడ ఉండే.. అగ్నిపర్వతాలు, రమణీయమైన ప్రకృతి దృశ్యాలతో నిండిన ఈ ప్రాంతాన్ని సందర్శించేందుకు పర్యాటకులు క్యూ కడతారు.