హమాస్ చీఫ్‌ను మట్టుబెట్టిన ఇజ్రాయెల్‌

హమాస్‌ చీఫ్‌ యాహ్యా సిన్వర్‌ను ఐడీఎఫ్‌ దళాలు మట్టుబెట్టాయి. హమాస్ చీఫ్ యాహ్యా సిన్వార్ మరణించినట్లు ఇజ్రాయెల్ విదేశాంగ మంత్రి ఇజ్రాయెల్ కాట్జ్ డీఎన్‌ఏ టెస్ట్‌ ద్వారా ధ్రువీకరించారు.

By అంజి  Published on  18 Oct 2024 1:20 AM GMT
Hamas , Yahya Sinwar, Israel, DNA testing, international news

హమాస్ చీఫ్‌ను మట్టుబెట్టిన ఇజ్రాయెల్‌

హమాస్‌ చీఫ్‌ యాహ్యా సిన్వర్‌ను ఐడీఎఫ్‌ దళాలు మట్టుబెట్టాయి. హమాస్ చీఫ్ యాహ్యా సిన్వార్ మరణించినట్లు ఇజ్రాయెల్ విదేశాంగ మంత్రి ఇజ్రాయెల్ కాట్జ్ డీఎన్‌ఏ టెస్ట్‌ ద్వారా ధ్రువీకరించారు. యాహ్యా సిన్వార్ మరణంపై, ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు మాట్లాడుతూ, ఇజ్రాయెల్ దళాలు "చెడుకు దెబ్బ" ఇచ్చాయని అన్నారు. అయితే, హమాస్‌కు వ్యతిరేకంగా మిషన్ ఇంకా ముగియలేదని ఆయన పేర్కొన్నారు.

1,200 మంది ఇజ్రాయెల్‌లను చంపిన అక్టోబర్ 7 దాడులు, యూదు రాజ్యంపై అత్యంత ఘోరమైన ఉగ్రవాద దాడి, మరియు మధ్యప్రాచ్యాన్ని గందరగోళంలోకి నెట్టాయి. "అక్టోబర్ 7 నాటి ఊచకోత మరియు దురాగతాలకు కారణమైన సామూహిక హంతకుడు యాహ్యా సిన్వార్ ఈ రోజు IDF సైనికులచే చంపబడ్డాడు" అని కాట్జ్ ఒక ప్రకటనలో తెలిపారు.

కాగా సిన్వర్‌ 1962లో గాజాలోని ఖాన్‌ యూనిస్‌లో జన్మించారు. గాజా వర్సిటీలో డిగ్రీ పూర్తి చేశారు. ఇజ్రాయెల్‌తో సంబంధం ఉన్నవారిని హత్య చేసినందుకు సిన్వర్‌ను 1988లో అరెస్ట్‌ చేశారు. 2011 వరకు ఆయన ఇజ్రాయెల్‌ జైల్లోనే గడిపారు. ఆ తర్వాత బయటకు వచ్చి హమాస్‌లో వేగంగా ఎదిగారు. 2015లో అతడిని యూఎస్‌ ఉగ్రవాదిగా ప్రకటించింది. 2017లో సిన్వర్‌ హమాస్ చీఫ్‌గా ఎన్నికయ్యారు.

గతేడాది అక్టోబర్‌ 7న ఇజ్రాయెల్‌ సరిహద్దులపై హమాస్‌ జరిపిన దాడిలో 1200 మంది మరణించారు. 250 మందిని బందీలుగా గాజాకు తీసుకెళ్లారు. దీంతో గాజాపై యుద్ధం ప్రకటించిన ఇజ్రాయెల్‌.. హమాస్‌ అగ్ర నేతలందరినీ చంపుతామని ప్రతిజ్ఞ చేసింది. అప్పటి నుంచి ఒక్కొక్కరిని వేటాడుతూ మట్టుబెట్టింది. మహమ్మద్‌ డైఫ్‌, ఇస్మాయిల్‌ హనియే, మర్వాన్‌ ఇస్సా, రాద్‌ సాద్‌, సలేహ్‌ అల్‌ అరౌరీ, యాహ్యా సిన్వార్‌ ఇలా టాప్‌ కమాండర్లందరినీ చంపేసింది.

Next Story