H-1B వీసా ఫీజు.. విదేశీ విద్యార్థులకు గుడ్‌న్యూస్
అమెరికాలో చదువుతున్న భారతీయులతో సహా ఇదర విదేశీ విద్యార్థులకు భారీ ఊరట లభించింది.
By - అంజి |
H-1B వీసా ఫీజు.. విదేశీ విద్యార్థులకు గుడ్‌న్యూస్
అమెరికాలో చదువుతున్న భారతీయులతో సహా ఇదర విదేశీ విద్యార్థులకు భారీ ఊరట లభించింది. అమెరికాలో చదువుతున్న వారికి హెచ్-1బీ వీసా ఫీజు నుంచి సిటిజ్ అండ్ ఇమిగ్రేషన్ మినహాయింపు కల్పించింది. అమెరికా బయటి నుంచి వచ్చే దరఖాస్తులకు మాత్రమే లక్ష డాలర్లు చెల్లించాలని స్పష్టం చేసింది.
యూఎస్ పౌరసత్వం మరియు ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ (USCIS) ప్రకారం.. అమెరికాలో చదువుకొని, ఉద్యోగాల కోసం హెచ్1 బీ వీసా అప్లికేషన్ పెట్టుకునే విదేశీ విద్యార్థులు లక్ష డాలర్లు చెల్లించాల్సిన అవసరం లేదని తెలిపింది. సెప్టెంబర్ 19, 2025న టీమ్ ట్రంప్ జారీ చేసిన $100,000 H-1B వీసా రుసుముపై వివాదాస్పద అధ్యక్ష ప్రకటన యజమానులను, వీసా హోల్డర్లను గందరగోళానికి గురిచేసింది ఎందుకంటే US ఏజెన్సీల నుండి మునుపటి మార్గదర్శకత్వం అనేక ప్రశ్నలకు సమాధానం ఇవ్వడంలో విఫలమైంది.
విదేశాల నుంచి వచ్చే దరఖాస్తుదారులు లక్ష డాలర్లు చెల్లించాల్సిందేనని పేర్కొన్న అమెరికా ప్రభుత్వం.. సెప్టెంబర్ 21న హెచ్1బీ వీసాపై ప్రకటన వెలువడిన తర్వాత వచ్చిన దరఖాస్తులకు మాత్రమే ఇది వర్తిస్తుందని తెలిపింది. ఈ ఫీజుల స్వీకరణ కోసం ఆన్‌లైన్ సర్వీస్ ప్రారంభించినట్టు తెలిపింది.