Video: వెయిట్ లిఫ్టింగ్ చేస్తూ.. మెడ విరిగి జిమ్‌ ట్రైనర్‌ మృతి

ఇండోనేషియాకు చెందిన 33 ఏళ్ల ఫిట్‌నెస్ ఇన్‌ఫ్లుయెన్సర్, జస్టిన్ విక్కీ.. 210 కిలోల బార్‌బెల్ ఎత్తడానికి ప్రయత్నించాడు.

By అంజి  Published on  23 July 2023 2:09 AM GMT
accident, Fitness, Gym trainer

Video: వెయిట్ లిఫ్టింగ్ చేస్తూ.. మెడ విరిగి జిమ్‌ ట్రైనర్‌ మృతి

ఇండోనేషియాకు చెందిన 33 ఏళ్ల ఫిట్‌నెస్ ఇన్‌ఫ్లుయెన్సర్, జస్టిన్ విక్కీ.. 210 కిలోల బార్‌బెల్ ఎత్తడానికి ప్రయత్నించాడు. అయితే ఆ బరువును అదుపు చేయలేక మెడ విరిగిపోవడంతో మరణించాడు. జూలై 15న ప్రమాదం జరిగినప్పుడు ఇండోనేషియాలోని బాలిలోని జిమ్‌లో అతను వర్కౌట్‌ చేస్తున్నాడని ఛానెల్ న్యూస్ ఆసియా తెలిపింది. సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన వీడియోలో.. జస్టిన్ విక్కీ ప్యారడైజ్ బాలి జిమ్‌ సెంటర్‌లో తన భుజాలపై బార్‌బెల్‌తో స్క్వాట్ ప్రెస్‌ను ప్రయత్నిస్తున్నట్లు చూడవచ్చు. అతను స్క్వాట్‌లోకి వెళ్ళిన తర్వాత నిటారుగా నిలబడలేకపోయాడు.

అతను బరువును పట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నప్పుడు, అతని మెడ వెనుక భాగంలో బార్బెల్ పడటంతో అతను తిరిగి కూర్చున్న స్థితిలో పడిపోయాడు. జస్టిన్ విక్కీ యొక్క స్పాటర్ తన బ్యాలెన్స్ కోల్పోయినట్లు అనిపిస్తుంది. సంఘటన సమయంలో అతనితో వెనుకకు పడిపోవడం చూడవచ్చు. స్పాటర్ వెయిట్ లిఫ్టింగ్ సమయంలో సహాయం, సపోర్టు అందించే వ్యక్తి. జస్టిన్ విక్కీ 210 కిలోగ్రాముల బరువును ఎత్తడానికి ప్రయత్నించినట్టు ఛానల్ న్యూస్ ఆసియా తెలిపింది. ప్రమాదం కారణంగా అతని మెడ విరగడం, గుండె, ఊపిరితిత్తులకు అనుసంధానించే ముఖ్యమైన నరాలను కుదింపు చేయడంతో అతను చనిపోయాడు.

జస్టిన్ విక్కీని చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. అయితే, అత్యవసర ఆపరేషన్ చేయించుకున్న కొద్దిసేపటికే అతడు మరణించాడని ఛానెల్ న్యూస్ ఏషియా పేర్కొంది. అతిగా బరువులు ఎత్తే క్రమంలో తగిన జాగ్రత్తలు పాటించకపోవడమే అతను చనిపోవడానికి కారణం అని వైద్యులు తేల్చారు. అతని మరణంతో జస్టిన్ విక్కీకి అభిమానులు నివాళులు అర్పించారు. ప్యారడైజ్ బాలి, అతను పనిచేసిన వ్యాయామశాల ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లో విక్కీ "స్పూర్తి, ప్రేరణకు నిదర్శనం" అని పేర్కొంది. ప్యారడైజ్ బాలి ఇన్‌స్టాగ్రామ్‌లోని ఒక పోస్ట్‌లో జస్టిన్ కేవలం ఫిట్‌నెస్ నిపుణుడు మాత్రమే కాదు, అతను ప్రేరణ, స్పూర్తి గల మార్గదర్శి అని పేర్కొంది.

Next Story