డోనాల్డ్ ట్రంప్‌పై కాల్పులు, గాయాలు

అమెరికా మాజీ అధ్యక్షుడు, రిపబ్లికన్ అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ పై కాల్పులు జరిగాయి.

By Srikanth Gundamalla  Published on  14 July 2024 6:26 AM IST
gun fire, Donald trump, America, president election,

డోనాల్డ్ ట్రంప్‌పై కాల్పులు, గాయాలు 

అమెరికా మాజీ అధ్యక్షుడు, రిపబ్లికన్ అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ పై కాల్పులు జరిగాయి. శనివారం పెన్సిల్వేనియాలోని బట్లర్‌లో ర్యాలీలో పాల్గొన్న సమయంలో కాల్పులు జరిపారు. ఈ సంఘటనలో ట్రంప్‌ గాయపడ్డారని వార్తా సంస్థ అసోసియేటెడ్ ప్రెస్ నివేదించింది. ఈ ఘటన జరిగిన తర్వాత సెక్యురిటీ ట్రంప్‌ను స్టేజీ నుంచి బయటకు తీసుకెళ్లడంతో ముఖంపై రక్తం కారినట్లు కనిపించింది.

అధ్యక్షుడు జో బైడెన్, ఆయన పరిపాలన గురించి ట్రంప్ మాట్లాడుతున్నప్పుడు కాల్పులు జరిపినట్లు తెలిసింది. కాల్పులు జరిగిన వెంటనే సీక్రెట్ సర్వీస్ ఏంజెట్‌ ట్రంప్‌ను కవర్ చేశారు. దాంతో.. ఆయనకు మరిన్ని బుల్లెట్లు తగలకుండా కాపాడారు. ఆ తర్వాత స్టేజ్‌ నుంచి బెయిటింగ్‌ వెహికల్‌ వద్దకు తరలించారు. ట్రంప్‌ క్షేమంగా ఉన్నారని.. ఆయన రక్షణ కోసం చర్యలు చేపట్టామని సీక్రెట్ సర్వీస్ ఒక ప్రకటనలో తెలిపింది. స్థానిక అధికారులు క్రైమ్ సీన్‌గా అభివర్ణించిన వేదికపై ట్రంప్ వెళ్లిన కొద్దిసేపటికే పోలీసులు ఫెయిర్‌గ్రౌండ్‌ను ఖాళీ చేయడం ప్రారంభించారు.

మరోవైపు ట్రంప్‌ను సెక్యూరిటీ స్టేజ్‌పై నుంచి తీసుకెళ్తున్నప్పుడు ప్రేక్షకులు హర్షధ్వానాలతో... తన పిడికిలిని గాలిలోకి చూపిస్తూ కనిపించారు ట్రంప్. వేదికపై నుంచి వెళ్లిన వెంటనే సాయుధ పోలీసులు పోడియం వద్దకు చేరుకున్నారు.

ట్రంప్ పెద్ద కుమారుడు, డోనాల్డ్ ట్రంప్ జూనియర్ ఈ ఘటనపై స్పందించారు. అతను మాట్లాడుతూ.. "అమెరికాను రక్షించడానికి అతను ఎప్పటికీ పోరాటాన్ని ఆపరు" అని ఎక్స్‌లో రాసుకొచ్చారు. ఒక అమెరికన్ జెండా ముందు తన పిడికిలి పైకెత్తి, ట్రంప్‌ని ముఖం రక్తంతో నిండిన ఫోటోను X లో పోస్ట్ చేశారు. ఇక దీనిపై స్పందిస్తున్న పలువురు రాజకీయ నాయకులు ఇలా హింసాత్మకంగా మారడం ఏమాత్రం సరికాదని చెబుతున్నారు.

Next Story