భద్రతా సమస్యలు ఉన్నప్పటికీ భార‌త్‌లో పాక్ ఐదుసార్లు ప‌ర్య‌టించింది.. పీసీబీకి మద్దతు ఇవ్వండి.!

వచ్చే ఏడాది జరిగే ఛాంపియన్స్ ట్రోఫీకి సంబంధించిన సమస్య ఇంకా అలాగే ఉంది. టీం ఇండియాను పాకిస్థాన్‌కు పంపడాన్ని బీసీసీఐ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది.

By Kalasani Durgapraveen  Published on  29 Nov 2024 12:00 PM IST
భద్రతా సమస్యలు ఉన్నప్పటికీ భార‌త్‌లో పాక్ ఐదుసార్లు ప‌ర్య‌టించింది.. పీసీబీకి మద్దతు ఇవ్వండి.!

వచ్చే ఏడాది జరిగే ఛాంపియన్స్ ట్రోఫీకి సంబంధించిన సమస్య ఇంకా అలాగే ఉంది. టీం ఇండియాను పాకిస్థాన్‌కు పంపడాన్ని బీసీసీఐ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. అదే సమయంలో పాకిస్తాన్ కూడా హైబ్రిడ్ మోడల్‌కు అంగీకరించడం లేదు. దీనికి సంబంధించి నేడు పెద్ద నిర్ణయం వెలువడే అవకాశం ఉంది. అయితే దీనికి ముందు పాకిస్థాన్ మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రిది ఓ ట్వీట్‌తో పీసీబీకి మ‌ద్ద‌తు తెలియ‌జేశాడు.

పాకిస్థాన్ వెళ్లేందుకు టీమిండియాకు భారత ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదని స్పష్టం చేస్తూ బీసీసీఐ ఐసీసీకి మెయిల్ రాసింది. ఈ విషయాన్ని ఐసీసీ పీసీబీకి తెలియజేసింది. దీంతో ఛాంపియన్స్ ట్రోఫీకి పాకిస్థాన్ ఆతిథ్యం ప్రమాదంలో పడింది. BCCI హైబ్రిడ్ మోడల్‌లో నిర్వహించాలంటుంది. టీమ్ ఇండియా మ్యాచ్‌లను వేరే దేశంలో నిర్వహించాలనే చర్చ ఉంది. పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఇందుకు సిద్ధంగా లేదు.

నివేదికల ప్రకారం.. ఛాంపియన్స్ ట్రోఫీ ఆతిథ్యంపై ఈరోజు నిర్ణయం రావచ్చు. దీనికిముందు.. షాహిద్ అఫ్రిది X లో ఒక పోస్ట్ చేసాడు.. అందులో అతడు.. రాజకీయాలను క్రీడలతో పెనవేయ‌డం ద్వారా బీసీసీఐ అంతర్జాతీయ క్రికెట్‌ను ప్రమాదకర స్థితిలోకి నెట్టింది. హైబ్రిడ్ మోడల్‌కు వ్యతిరేకంగా PCB వైఖరికి పూర్తిగా మద్దతు ఇవ్వండి.. ప్రత్యేకించి పాకిస్తాన్ (భద్రతా సమస్యలు ఉన్నప్పటికీ) 26/11 తర్వాత ద్వైపాక్షిక వైట్-బాల్ సిరీస్‌తో సహా ఐదుసార్లు భారత్‌లో పర్యటించింది. ICC, దాని బోర్డు ఆప్‌ డైరెక్టర్లు సరైన నిర్ణయం తీసుకుని, నిష్పక్షపాతంగా ఉండాల్సిన సమయం వచ్చింది.

నివేదికలను విశ్వసిస్తే.. హైబ్రిడ్ మోడల్‌కు PCB అంగీకరించకపోతే.. ఛాంపియన్స్ ట్రోఫీ వేదిక‌ను కోల్పోవాల్సివ‌స్తుంది. ఇదే జరిగితే ఈ టోర్నీని దక్షిణాఫ్రికా లేదా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అంటే UAEలో ఆడవచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో పాకిస్థాన్‌కు భారీ నష్టం వాటిల్లుతుంది. ఈ టోర్నీ కోసం పాకిస్థాన్ కోట్లాది రూపాయలను వెచ్చించింది.

Next Story