విమానంలో యువకుడి వెకిలి చేష్టలు.. సీటుకు క‌ట్టేసిన సిబ్బంది

Frontier Airlines Passenger Taped To Seat After Allegedly Groping And Assaulting Crew.విమానంలో ప్ర‌మాణిస్తున్న

By తోట‌ వంశీ కుమార్‌  Published on  7 Aug 2021 2:53 AM GMT
విమానంలో యువకుడి వెకిలి చేష్టలు.. సీటుకు  క‌ట్టేసిన సిబ్బంది

విమానంలో ప్ర‌మాణిస్తున్న ఓ యువ‌కుడు మ‌హిళా సిబ్బందితో అస‌భ్యంగా ప్ర‌వ‌ర్తించాడు. అంతేకాకుండా ప్ర‌యాణీకుల‌తోనూ గొడ‌వ పెట్టుకున్నాడు. అత‌డి ఆగ‌డాలు శృతిమించ‌డంతో సిబ్బంది అత‌డిని సీటుకే క‌ట్టేసి నోటికి ప్లాస్ట‌ర్ అంటించారు. అతడిని క‌ట్టేసే స‌మ‌యంలో మిగ‌తా ప్ర‌యాణీలు ఆనందం వ్య‌క్తం చేశారంటే.. వాళ్ల‌ను అత‌డు ఏ మేరకు విసిగించాడో అర్థం చేసుకోవ‌చ్చు. ఇందుకు సంబంధించిన వీడియోలు ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా మారాయి.

ఫిలడెల్ఫియా నుంచి మియామీ వెళుతున్న ఫ్రాంటియర్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానంలో మాక్స్‌వెల్ బెర్రీ (22) అనే యువకుడు ప్ర‌యాణీస్తున్నాడు. అయితే.. ప్ర‌యాణంలో అత‌డు ఫ్లైట్‌లోని మహిళా సిబ్బందితో అసభ్యకరంగా ప్రవర్తించాడు. తన నోటికి ఇష్టమొచ్చినట్టుగా మాట్లాడాడు. ఓ మహిళా సిబ్బంది ఛాతీ భాగాన్ని తాకడం, మరోకరి పిరుదులను తాకడం చేశాడనే ఆరోపణలు ఉన్నాయి. తోటి ప్రయాణీకుల‌తో మాట‌ల యుద్దానికి దిగాడు. అత‌డిని ప్ర‌శ్నించిన సిబ్బందిపై దాడికి పాల్ప‌డ్డాడు.

మాక్స్‌వెల్ బెర్రీ తీరుతో విసుగు చెందిన విమాన సిబ్బంది.. అత‌డిని ప‌ట్టుకుని అత‌డి సీటులోనే క‌ట్టిప‌డేశారు. అత‌డు మాట్లాడ‌కుండా ఉండేందుకు అత‌డి నోటికి టేప్ అతికించారు. అత‌డిని క‌ట్టేస్తుంటే.. తోటి ప్ర‌యాణీకులంతా న‌వ్వుతూ త‌మ ఆనందం వ్య‌క్తం చేశారు. ఇందుకు సంబంధించిన దృశ్యాల‌ను కొంద‌రు త‌మ ఫోన్ల‌లో వీడియో తీశారు. ప్ర‌స్తుతం రెండు వీడియోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారాయి. ఓ వీడియోను ఇప్పటి వరకు 12.7 మిలియన్ల మందికిపైగా వీక్షించారు. విమానం ల్యాండ్ అవుతున్న సమయంలో తనను కాపాడాలంటూ యువకుడు అరుస్తున్న మరో వీడియో కూడా వైరల్ అయింది. ఆ వీడియోకు 3.6 మిలియ‌న్ల వ్యూస్ వ‌చ్చాయి.

విమానం ల్యాండ్ అయ్యాక విమాన సిబ్బంది యువకుడిని పోలీసులకు అప్పగించారు. కాగా.. ప్ర‌యాణికుడిని అదుపు చేయ‌డానికి స‌రైన విధానాలను పాటించ‌లేద‌ని విమాన సిబ్బందిని అధికారులు స‌స్పెండ్ చేశారు. దీనిపై పెద్ద ఎత్తున నిర‌స‌న వ్య‌క్తం కావ‌డంతో .. విమాన సిబ్బంది త‌ప్పులేద‌ని చెప్ప‌డంతో ఎయిర్ లైన్ తొలుత చేసిన ప్ర‌క‌ట‌న‌ను వెన‌క్కి తీసుకుంది. నిబంధ‌న ప్ర‌కారం సిబ్బందిని వేత‌నంతో కూడిన సెల‌వుపై పంపిన‌ట్టుగా తెలిసింది.

Next Story