ఫ్రెంచ్ అధ్యక్షుడి చెంప చెళ్లుమనిపించిన మహిళ.. వీడియో వైరల్
French President Emmanuel Macron slapped again video goes viral.ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్‌కు చేదు
By తోట వంశీ కుమార్
ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్‌కు చేదు అనుభవం ఎదురైంది. ఓ మహిళ అతడి చెంప చెళ్లుమనిపించింది. ఇందుకు సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఘటన ఆదివారం జరిగినట్లు తెలుస్తోంది.
అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ ఎక్కడికో వెలుతుండగా ఆలివ్ గ్రీన్ టీ-షర్ట్ ధరించిన ఓ మహిళ అతడి ఎదురుగా వచ్చి చేతితో చెంప పగుల కొట్టింది. వెంటనే అప్రమత్తమైన అధ్యక్షుడి భద్రతా సిబ్బంది ఆమెను పక్కకు లాక్కెళ్లి దాడి చేసినట్లు స్థానిక మీడియా తెలిపింది. ఘటన జరిగిన సమయంలో కొందరు మీడియా ప్రతినిధులు కూడా అక్కడే ఉన్నట్లు నివేదికలు తెలిపాయి. ఈ వీడియో వైరల్‌గా మారింది.
Emmanuel Macron got slapped up again pic.twitter.com/puqyPnJOyB
— Luke Rudkowski (@Lukewearechange) November 20, 2022
కాగా.. గతంలో కూడా ఇలాంటి సంఘటనే జరిగింది. 2021 జూన్ 8న ఆగ్నేయ ప్రాంతాన్ని సందర్శించినప్పుడు ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్‌ను ఓ యువకుడు చెంప పై కొట్టాడు. డోమ్ ప్రాంతంలోని టైన్-ఎల్ హెర్మిటేజ్ గ్రామంలో ఓ పాఠశాలను సందర్శించి , కొవిడ్ ప్రొటొకాల్స్ చెక్ చేసి తిరిగి వెలుతుండగా ఈ ఘటన జరిగింది. ఆ సమయంలో అధ్యక్షుడిని చూసేందుకు పెద్ద సంఖ్యలో జనం గుమిగూడారు. మాక్రాన్ వారి వద్దకు వెళ్లి కరచాలనం చేస్తుండగా..ఓ యువకుడు షేక్‌హ్యాండ్ ఇచ్చినట్లే ఇచ్చి చెంప చెళ్లుమనిపించాడు. భద్రతా సిబ్బంది ఆ యువకుడితో పాటు అతడికి సహకరించిన మరో వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు.