అడవిలో ఆకలి కేకలతో మరణించిన ఐరిష్ యువతి..!
French-Irish teen 'starved and died' by 'misadventure'. అడవిలో అడ్వెంచర్ కోసం వెళ్లిన ఫ్రెంచ్ ఐరిష్ యువతి చివరకు ఆకలి కేకలతో మరణించింది .
By Medi Samrat
అడవిలో అడ్వెంచర్ కోసం వెళ్లిన ఫ్రెంచ్ ఐరిష్ యువతి చివరకు మృతదేహం కనిపించింది. ఈమె మృతిపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 2019లో కౌలాలంపూర్ వెలుపల ఉన్న రిసార్ట్ నుంచి అదృశ్యమైన నోరా మృతదేహాన్ని మలేషియా పోలీసులు గుర్తించారు. రిసార్ట్ నుంచి బయటకు వచ్చి అక్కడి అందాలను వీక్షిస్తూ దారి తప్పి పోయి అడవిలోకి వెళ్ళిన నోరా అడవి ప్రాంతంలో దారి తెలియక ఆకలితో చనిపోయి ఉంటుందని మలేషియా పోలీసులు భావించారు.
ఎక్కువ రోజుల పాటు నోరా అడవిలోనే ఉండటం వల్ల సరైన సమయానికి ఆహారం దొరకక అంతర్గత రక్తస్రావం ఏర్పడి చెందినట్లు శవ పరీక్షలలో వెల్లడించారు. కానీ నోరా తల్లిదండ్రులు మాత్రం తమ కూతుర్ని ఎవరు బంధించి లైంగికంగా దాడి చేసి చంపేశారనే అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా తాము బస చేసిన రిసార్ట్ గదిలో ఉన్న తన కూతురిని బయట కిటికీలో నుంచి ఓ వ్యక్తి చూస్తూ ఉండటం గమనించామని నోరా తల్లిదండ్రులు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో తెలిపారు.
దీనిపై స్పందించిన పోలీసులు దారి తప్పి అడవిలోకి వెళ్లడం వల్ల ఆమె మరణించిందని, ఆమె పై ఎటువంటి దాడి కానీ, ప్రమాదం కాని జరగలేదని మలేషియా అధికారులు తెలియజేశారు. నోరా కోసం దాదాపు వందలాది మంది రక్షకులు,హెలికాప్టర్లు, స్నిఫర్ డాగ్స్ ఉన్న బృందం 10 రోజుల వేట అనంతరం మృతదేహాన్ని రిసార్ట్ పక్కనే ఉన్న ఒక కాలువ దగ్గర గుర్తించారు. అయితే నోరా ప్రమాదవశాత్తు మాత్రమే మరణించిందని,ఆమెపై ఎటువంటి దాడి జరిగిన ఆనవాళ్లు కూడా లేవని కోర్టు స్పష్టం చేసింది. వీడియో లింక్ ద్వారా నోరా తల్లిదండ్రులు కోర్టు విచారణకు హాజరయ్యారు