అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్ కరోనా మహమ్మారి బారిన పడ్డారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. తనకు కరోనా పాజిటివ్‌గా వచ్చిందని, లక్షణాలు స్వల్పంగానే ఉన్నట్లు తెలిపారు. ప్రస్తుతం ఇంట్లోనే క్వారంటైన్‌లో ఉన్నట్లు చెప్పారు.
"నాకు కరోనా పాజిటివ్‌గా నిర్థారణ అయింది. లక్షణాలు స్వల్పంగా ఉన్నాయి. నేను బాగానే ఉన్నా. ఇంట్లోనే క్వారంటైన్‌లో ఉన్నా. వ్యాక్సిన్ తో పాటు బూస్టర్ డోసు తీసుకోవడం వల్ల తీవ్రత తక్కువగా ఉంది. అందరూ వ్యాక్సిన్ తీసుకోవాలి. ఈ శీతాకాలంలో అందరూ జాగ్రత్తగా ఉండండి" అని క్లింటన్ ట్వీట్ చేశారు.
1993 నుంచి 2001 వరకు రెండు సార్లు అమెరికా అధ్యక్షుడిగా క్లింటన్ పని చేశారు. 2004 తరువాత నుంచి ఆయన్ను అనారోగ్య సమస్యలు వెంటాడుతున్నాయి.