ఫ్లోరిడాకు చెందిన ఓ కంటెంట్ క్రియేటర్.. తనను తాను "డాగ్ మామ్" అని పిలుచుకుంటూ, తన పెంపుడు జంతువు చివావాతో లైంగిక చర్యలను నిర్వహించింది. ఆ తర్వాత 15,000 మంది అనుచరులతో తన ఇన్‌స్టాగ్రామ్ పేజీలో ఆ వికారమైన వీడియోలను అప్‌లోడ్ చేసింది. ఈ విషయమై జనవరిలో పోలీసులకు సమాచారం అందింది. గుమిన్స్కీ అనే యువతి "ఒక కుక్కతో లైంగిక కార్యకలాపాలను చిత్రీకరించే వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది" అని షెరీఫ్ కార్యాలయం తెలిపింది.
ఆమె వీడియో వైరల్ కావడంతో షెరీఫ్ కార్యాలయం వెంటనే అప్రమత్తమైంది. ఒక అనామక సమాచారం మేరకు, ఫ్లోరిడా పోలీసులు 27 ఏళ్ల ఆ యువతిని అరెస్టు చేసి, ఆమెపై రెండు అభియోగాలు మోపారు. ఒక జంతువుతో లైంగిక సంబంధం కలిగి ఉండటం, ఒక జంతువుతో లైంగిక సంబంధాన్ని చిత్రీకరించడం. మారియన్ కౌంటీ షెరీఫ్ కార్యాలయం షేర్ చేసిన ఫేస్‌బుక్ పోస్ట్‌లో,ఇన్‌ఫ్లుయెన్సర్ లోగాన్ గుమిన్స్కీని స్థానిక పోలీసులు చేతులకు సంకెళ్లు వేసి తీసుకెళ్లడాన్ని చూడవచ్చు అని పేర్కొంది.
దర్యాప్తు చేసిన తర్వాత, గుమిన్స్కీ వద్ద వేధింపులకు గురైన కుక్క యొక్క అనేక వీడియోలు, చిత్రాలు ఉన్నాయని పోలీసులు కనుగొన్నారు. దర్యాప్తు సమయంలో, గుమిన్స్కీ తన పెంపుడు జంతువుతో సన్నిహితంగా ఉన్న మరిన్ని వీడియోలకు బదులుగా ఒక సోషల్ మీడియా వినియోగదారు నుండి 500 డాలర్లు (దాదాపు రూ. 43,000) అందుకున్నట్లు అంగీకరించింది. ఆమె ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లలో ఆమె తన కుక్కలతో ముద్దు పెట్టుకోవడం, కౌగిలించుకోవడం వంటి అనేక పోస్ట్‌లు కనిపిస్తాయి. మార్చి 22న, గుమిన్స్కీ 10,000 యూఎస్ డాలర్ బాండ్‌పై విడుదలైంది. ఏప్రిల్ 22న కోర్టులో హాజరు కావాల్సి ఉంది.