రియాద్‌లో ఘోర ప్రమాదం.. హైదరాబాద్‌కు ఇద్దరు సహా ఐదుగురు భారతీయులు మృతి

రియాద్‌లో గురువారం తెల్లవారుజామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో హైదరాబాద్‌కు చెందిన ఇద్దరు సహా ఐదుగురు

By అంజి  Published on  7 April 2023 9:41 AM IST
Hyderabad,Indians,Riyadh,Umrah

రియాద్‌లో ఘోర ప్రమాదం.. హైదరాబాద్‌కు ఇద్దరు సహా ఐదుగురు భారతీయులు మృతి

రియాద్‌లో గురువారం తెల్లవారుజామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో హైదరాబాద్‌కు చెందిన ఇద్దరు సహా ఐదుగురు ఉమ్రా చేసేందుకు వెళ్తూ ప్రాణాలు కోల్పోయారు. రియాద్‌లోని సువైదీ ప్రాంతంలో ఇరుగుపొరుగు వారు అహ్మద్ అబ్దుల్ రషీద్ (27), మహమ్మద్ షాహిద్ ఖత్రీ (24) కుటుంబాలు కలిసి ఉమ్రా చేసేందుకు ప్రయాణిస్తుండగా గురువారం తెల్లవారుజామున 3:00 గంటల సమయంలో ఎదురుగా వస్తున్న మరో కారు ఢీకొట్టింది. మృతుల బంధువులు వెల్లడించిన ప్రాథమిక సమాచారం ప్రకారం..

హైదరాబాద్‌కు చెందిన అహ్మద్ అబ్దుల్ రషీద్ తన గర్భవతి అయిన భార్య ఖాన్సా, అతని మూడేళ్ల కుమార్తె మరియం, రాజస్థాన్‌లోని సికార్ జిల్లాకు చెందిన మహ్మద్ షాహిద్ ఖత్రీ, అతని భార్య సుమయ్య, వారి నాలుగేళ్లతో కలిసి కారులో మక్కాకు వెళుతుండగా వారి కారు ప్రమాదానికి గురైంది. అహ్మద్‌ అబ్దుల్‌ రషీద్‌ తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో ప్రాణాలతో పోరాడుతున్నాడు. అతని భార్య, కూతురు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ప్రమాదంలో షాహిద్ ఖత్రీ, అతని నాలుగేళ్ల కుమారుడు అక్కడికక్కడే మృతి చెందగా, అతని భార్య సుమయ్య సాయంత్రం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు.

కుటుంబ స్నేహితులు అవసరమైన చట్టపరమైన లాంఛనాలను పూర్తి చేసారు. మృతదేహాలకు శుక్రవారం రియాద్‌లో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. రంజాన్ ప్రారంభంలో, ఖమీస్ ముషైత్ ప్రాంతంలో నివసిస్తున్న 21 మంది ప్రవాసులు ఉమ్రా చేయడానికి వెళ్తుండగా బస్సు ప్రమాదంలో మరణించారు.

Next Story