యూకే ప్రయాణం.. కాస్త కష్టమే..
First travellers arrive in UK for hotel quarantine stay. కరోనా కారణంగా యూకే అతలాకుతలం అయిన సంగతి తెలిసిందే..!
By Medi Samrat
కరోనా కారణంగా యూకే అతలాకుతలం అయిన సంగతి తెలిసిందే..! సరికొత్త కోవిడ్ స్ట్రెయిన్లు కూడా యూకేను ఎన్నో ఇబ్బందులు పెడుతున్నాయి. దీంతో యూకే ప్రభుత్వం కఠినమైన ప్రయాణ ఆంక్షలను ప్రకటించింది. హైరిస్క్ రెడ్ లిస్ట్‌లో ఉన్న 33 దేశాల నుంచి ఇంగ్లండ్‌కు తిరిగి వచ్చిన యూకే, ఐర్లాండ్‌కు చెందిన ప్రయాణీకులు హోటల్‌లో క్వారంటైన్‌లో గడపాలి. ఇంగ్లండ్‌కు రావాలనుకునే వారు 10 రోజులపాటు ప్రభుత్వం నిర్దేశించిన హోటళ్లలో క్వారంటైన్‌లో గడిపేందుకు, రవాణా చార్జీలు, వైద్య పరీక్షలకు అవసరమైన 1,750 పౌండ్లు(రూ.1,76,581)ను ముందుగా చెల్లించాలి.
ఈ నిబంధనలను ఉల్లంఘించిన వారికి 10 ఏళ్ల జైలు శిక్షతోపాటు 10వేల పౌండ్ల వరకు జరిమానా ఉంటుంది. రెడ్ లిస్ట్‌లో భారతదేశం లేదు. రెడ్ లిస్ట్ లో ఉండని దేశాలకు వెళ్లని యూకే, ఐర్లాండ్ నివాసితులు 10 రోజులపాటు తమ ఇళ్లలో క్వారంటైన్‌లో గడపాలి. ఇంగ్లండ్‌కు చేరుకున్న 2వ, 8వ రోజున తప్పనిసరిగా కరోనా టెస్ట్ చేయించుకోవాలని అధికారులు ఆదేశించారు. యూకే ఆరోగ్య శాఖ ఆదేశాల ప్రకారం దేశంలో కోటిన్నర మందికి వ్యాక్సినేషన్ పూర్తయిందని వెల్లడించింది.
యూకే రెడ్‌లిస్ట్‌లో చేర్చిన 33 దేశాల్లో వివిధ కోవిడ్–19 వేరియంట్లు వ్యాప్తిలో ఉండటం గమనార్హంఉన్నాయి. రెడ్ లిస్ట్‌లోని 33 దేశాలకు చెందిన యూకే నాన్ రెసిడెంట్లపై బ్రిటన్‌లో ప్రవేశించరాదనే నిబంధన కూడా ఉంది. నిబంధనలు ఉల్లంఘించిన వారికి జరిమానాలు విధించడం, అనుమానిత ప్రయాణీకులను గుర్తించి మూడు గంటలపాటు నిర్బంధంలో ఉంచేందుకు పోలీసులకు అధికారాలిచ్చారు. క్వారంటైన్ కేంద్రాల్లో ఉండే వారు నిబంధనల ప్రకారం నడుచుకునేలా చూసేందుకు ప్రత్యేకంగా బలగాలను రంగంలోకి దించారు.