రోహింగ్యాల శిబిరంలో భారీ అగ్ని ప్రమాదం

Fire destroys thousands of homes in Rohingya refugee camp. దక్షిణ బంగ్లాదేశ్‌లోని రోహింగ్యాలు ప్రవాస శిబిరంలో భారీ అగ్ని ప్రమాదం

By Medi Samrat  Published on  24 March 2021 2:27 AM GMT
Fire destroys thousands of homes in Rohingya refugee camp

దక్షిణ బంగ్లాదేశ్‌లోని రోహింగ్యాలు ప్రవాస శిబిరంలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ దుర్ఘటనలో అనేకమంది మృత్యువాతపడగా, వందలాది మంది నిరాశ్రయులయ్యారు. ఇటీవల కాలంలో జరిగిన అగ్నిప్రమాదాల్లో ఇది అతి పెద్దదని అధికారులు చెబుతున్నారు.

బంగ్లాదేశ్‌లోని కాక్స్‌బజార్‌లోని బలూఖాలిలో వందలాది మంది రోహింగ్యాలు శిబిరాలను ఏర్పాటు చేసుకుని నివాసముంటున్నారు. ఒక ఇంట్లో చిన్నగా చెలరేగిన మంటలు ఆ ప్రాంతమంతా వ్యాపించాయి. దీంతో దట్టమైన పొగలు అలుముకుని శరణార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ ప్రమాదంలో 15 మంది సజీవదహనమయ్యారు. మరో 400 మంది ఆచూకీ తెలియట్లేదు. 500 మందికి పైగా గాయపడ్డారు. అయితే, ఈ ఘటనకు సంబంధించి కచ్చితమైన వివరాలను అధికారులు గానీ, యూఎన్‌వో గానీ వెల్లడించలేకపోయారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పేందుకు ప్రయత్నించారు. అయితే.. వారు అక్కడికి

చేరుకునేలోపే తీవ్ర నష్టం వాటిల్లింది. మంటలు వేగంగా వ్యాపించడంతో ప్రమాద తీవ్రత పెరిగిందని బాధితులు చెబుతున్నారు. క్యాంపులో అధికశాతం షెల్టర్లు వెదురుతో నిర్మించినవి కావడంతో ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉందని యూఎన్‌ రెఫ్యూజీ ఏజెన్సీ ప్రతినిధులు చెప్పారు. మంటల్లో నాలుగు ఆస్పుత్రులు, ఆరు హెల్త్‌ సెంటర్లు ధ్వంసమయ్యాయి. బర్మా నుంచి రోహింగ్యాల వలసలు ఆరంభమైనప్పటినుంచి ఇది అదిపెద్ద ప్రమాదమని బంగ్లా అధికారులు చెప్పారు. ఈ ఘటనలో వందలాది తాత్కాలిక గుడారాలు కాలి బూడిదయ్యాయి. దీంతో వేలాది మంది శరణార్థులు నిరాశ్రయులయ్యారు. మయన్మార్‌లో ఘర్షణల అనంతరం దేశం విడిచిపెట్టి వచ్చిన వారిలో కాక్స్‌ బజార్‌లో నే దాదాపు 11 లక్షల మంది రోహింగ్యాలు వివిధ క్యాంపుల్లో ఆశ్రితులుగా ఉంటున్నారు. వీరిని బర్మా తరలించాలని భావించినా, ఆదేశంలో మిలటరీ పాలన రావ డంతో వీరి భవితవ్యంపై అయోమయం నెలకొంది. ఆత్మీయులను కోల్పోయి, నిరాశ్రయులుగా మారి రోదిస్తున్న రోహింగ్యాల కష్టాలను చూసి పలువురు కంటతడి పెడుతున్నారు.



Next Story