విషాదం.. అనుమానస్పద స్థితిలో సింగర్ మృతదేహం
Famous Singer Aaron Carter dies aged 34. సినీ ఇండస్ట్రీలో మరో విషాద ఘటన జరిగింది. ప్రముఖ అమెరికన్ గాయకుడు, రాపర్ పాప్ ఐకాన్ ఆరోన్ కార్టర్
By అంజి Published on 6 Nov 2022 11:03 AM ISTసినీ ఇండస్ట్రీలో మరో విషాద ఘటన జరిగింది. ప్రముఖ అమెరికన్ గాయకుడు, రాపర్ పాప్ ఐకాన్ ఆరోన్ కార్టర్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. ఆరోన్ కార్టర్ వయస్సు 34 సంవత్సరాలు. తన హిట్ ఆల్బమ్ 'ఆరోన్స్ పార్టీ (కమ్ గెట్ ఇట్)'తో ఆరోన్ ప్రపంచ ప్రఖ్యాతి గడించాడు. సౌత్ కాలిఫోర్నియాలోని లాంకాస్టర్‌లో గల అతని నివాసంలో టబ్‌లో అనుమానాస్పదస్థితిలో చనిపోయాడని స్థానిక మీడియా తెలిపింది. శనివారం ఉదయం 10:58 గంటలకు ఇంట్లో కార్టర్ మృతదేహాం కనుగొనబడింది. అయితే ఈ విషయమై కార్టర్ మేనేజర్ వెంటనే స్పందించలేదు. ఆరోన్ కార్టర్ మరణంతో సినీ పరిశ్రమ షాక్‌కు గురయ్యింది.
ఆరోన్ మృతికి గల కారణాలు ఇప్పటివరకు తెలియరాలేదు. ఆరోన్ మృతిపట్ల అభిమానులు, సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఫ్లోరిడాలోని టంపాలో డిసెంబర్ 7, 1987న జన్మించిన ఆరోన్ కార్టర్.. ఏడేళ్ల వయసులో తన ప్రదర్శన ప్రారంభించాడు. 1997లో తొమ్మిదేళ్ల వయసులో తన తొలి ఆల్బమ్‌ను విడుదల చేశాడు. అతని రెండవ సంవత్సరం ప్రయత్నం "ఆరోన్స్ పార్టీ (కమ్ గెట్ ఇట్)" మూడు మిలియన్ కాపీలు స్టేట్‌సైడ్‌లో అమ్ముడైంది. దీంతో చిన్న వయసులోనే ఆరోన్ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. కార్టర్ 1997లో బ్యాక్‌స్ట్రీట్ బాయ్స్ టూర్‌లో ఎంట్రీ ఇచ్చాడు.
ఆరోన్ మరణాన్ని అంబ్రెల్లా మేనేజ్మెంట్లో కార్టర్ ఏజెంట్ టెలర్ హెల్గెసన్ రిపోర్ట్ చేశారు. లాస్ ఏంజిల్స్ కౌంటీ షెరీఫ్ డిపార్ట్‌మెంట్ డిప్యూటీ అలెజాండ్రా పర్రా ప్రకారం.. వ్యాలీ విస్టా డ్రైవ్‌లోని 42,000 బ్లాక్‌లోని ఆరోన్ కార్టర్ ఇంటి వద్ద ఉదయం 11 గంటలకు ఆరోన్ అనుమానాస్పద స్థితిలో మరణించినట్లుగా సమాచారం అందింది.