భారత్‌కు F-35 యుద్ధ విమానాలు: ట్రంప్

భారత్‌కు అత్యంత అధునాతన F-35 ఫైటర్‌ జెట్లను అందించేందుకు తాము సిద్ధంగా ఉన్నట్టు యూఎస్‌ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తెలిపారు.

By అంజి  Published on  14 Feb 2025 10:18 AM IST
F-35 jets, trade deal, Modi-Trump meet, international news

భారత్‌కు F-35 యుద్ధ విమానాలు: ట్రంప్

భారత్‌కు అత్యంత అధునాతన F-35 ఫైటర్‌ జెట్లను అందించేందుకు తాము సిద్ధంగా ఉన్నట్టు యూఎస్‌ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తెలిపారు. ఇకపై భారత్‌కు మిలిటరీ ఉత్పత్తుల విక్రయాలు పెంచుతామని చెప్పారు. తమ దేశంలోని చమురు, గ్యాస్‌ను భారత్‌ అధిక మొత్తంలో కొనుగోలు చేస్తుందని పేర్కొన్నారు. ముంబై ఉగ్రదాడి నిందితుడు తహవూర్‌ రాణాతో పాటు మరికొంత మంది నిందితులను భారత్‌కు అప్పగిస్తామన్నారు. అయితే భారత్‌ విధిస్తున్న టారిఫ్‌లపై ట్రంప్‌ ప్రధాని మోదీ ముందే అసహనం వ్యక్తం చేశారు. అధిక టారిఫ్‌లు వాణిజ్యానికి అడ్డంకిగా మారాయని, దీంతో భారత్‌లో వస్తువులు అమ్మడం చాలా కష్టమవుతోందన్నారు.

ప్రపంచంలో ఎక్కువ టారిఫ్స్‌ విధించే దేశం భారతేనని, అందుకే తాము కూడా అదే పద్ధతి పాటిస్తామని చెప్పారు. భారత్‌ ఎంత ఛార్జ్‌ చేస్తుందో తాము.. అంతే ఛార్జ్‌ చేస్తామని ట్రంప్‌ స్పష్టం చేశారు. ఏ దేశాన్నైనా ఓడించగలిగే స్థితిలో యూఎస్‌ ఉందని ట్రంప్‌ అన్నారు. కానీ తాము ఎవరినీ ఓడించాలని అనుకోవడం లేదని చెప్పారు. 'వాణిజ్యం విషయంలో ఒక వేళ భారత్‌తో కఠినంగా వ్యవహరిస్తే చైనాతో ఎలా పోరాడుతారు?' అని రిపోర్టర్స్‌ అడిగిన ప్రశ్‌నకు ఆయనపై విధంగా బదులిచ్చారు. అమెరికన్ల కోసం గతంలో తాము అద్భుతంగా పని చేశామన్నారు. కానీ గత నాలుగేళ్లలో భయంకరమైన పరిపాలన వల్ల తమకు అంతరాయం కలిగిందన్నారు.

Next Story