నేను బ్రిటన్‌ ప్రధానిగా ఎన్నికైతే చైనాకు చుక్కలే: రిషి సునాక్

Enough is enough rishi sunak pledges to get tough on china if elected. చైనాపై బ్రిటన్‌ ప్రధాని అభ్యర్థి, భారత సంతతి వ్యక్తి రిషి సునాక్‌ సంచలన కామెంట్స్‌ చేశాడు.

By అంజి  Published on  25 July 2022 10:12 AM IST
నేను బ్రిటన్‌ ప్రధానిగా ఎన్నికైతే చైనాకు చుక్కలే: రిషి సునాక్

చైనాపై బ్రిటన్‌ ప్రధాని అభ్యర్థి, భారత సంతతి వ్యక్తి రిషి సునాక్‌ సంచలన కామెంట్స్‌ చేశారు. తాను బ్రిటన్‌ ప్రధానిగా ఎన్నికైతే చైనా పట్ల కఠినంగా వ్యవహరిస్తానని చెప్పారు. చైనా, రష్యా పట్ల రిషి సునాక్‌ బలహీనుడిగా ప్రత్యర్థి లిజ్‌ ట్రస్‌ ఆరోపణలు చేయడంతో మాజీ ఆర్థిక మంత్రి రిషి సునాక్‌ మాట్లాడారు. డొమెస్టిక్‌, ఇంటర్నేషనల్‌ సెక్యూరిటీకి చైనా నెంబర్‌ వన్‌ ప్రమాదకారి అని ఆరోపించారు. ఇదిలా ఉంటే.. యునైటెడ్‌ కింగ్‌డమ్‌ - చైనా సంబంధాల అభివృద్ధికి రిషి సునాక్‌ సరైన వ్యక్తి అని చైనా ప్రభుత్వ అధికారిక మీడియా గ్లోబల్‌ టైమ్స్‌ ఇటీవల పేర్కొంది.

తాను ప్రధాని పదవి చేపడితే చైనా పట్ల సీరియస్‌గా వ్యవహరిస్తానని రిషి చెప్పారు. బ్రిటన్‌లోని 30 ఇన్‌స్టిట్యూట్లను మూసివేస్తామన్నారు. దీంతో చైనా సంస్కృతి, భాషా కార్యక్రమాల ద్వారా వ్యాప్తి చేస్తున్న సాఫ్ట్ పవర్ ప్రభావాన్ని అడ్డుకుంటామన్నారు. యూనివర్సిటీల నుంచి చైనా కమ్యూనిస్ట్‌ పార్టీని తరిమికొడతామన్నారు. చైనా గూఢచర్యాన్ని అడ్డుకునేందుకు బ్రిటన్‌ డొమెస్టిక్ స్పై ఏజెన్సీ ఎంఐ5ని ఉపయోగిస్తామన్నారు. రష్యా చమురును కొనుగోలు చేస్తూ విదేశాల్లో వ్లాదిమిర్‌ పుతిన్‌కు చైనా మద్దతుగా నిలుస్తోందన్నారు.

చైనా సైబర్‌ దాడులను అడ్డుకునేందుకు నాటో తరహా అంతర్జాతీయ సహకారాన్ని నిర్మిస్తామని, చైనా స్వదేశంలో మన సాంకేతికతను దొంగిలించి, విశ్వవిద్యాలయాల్లోకి చొచ్చుకుపోతోందన్నారు. తైవాన్‌తో పాటు పక్కనున్న దేశాలను చైనా బెదిరించే ప్రయత్నం చేస్తోందని రిషి సునాక్‌ పేర్కొన్నారు. తీర్చలేనన్ని అప్పులు ఇస్తూ అభివృద్ధి చెందుతున్న దేశాలను చైనా తన ఆధీనంలోకి తెచ్చుకుంటోందని తీవ్ర విమర్శలు చేశారు. జింజియాంగ్‌, హాంకాంగ్‌లలో తన సొంత ప్రజలను వేధించటం, అరెస్టులు చేస్తూ మానవ హక్కులను కాలరాస్తోందని ఆరోపించారు.

Next Story