ఇటీవల ట్విట్టర్‌ను సొంతం చేసుకున్న టెస్లా అధినేత ఎలాన్ మస్క్ మార్పులకు శ్రీకారం చుట్టారు. ఇప్పటికే ఆ సంస్థలో పనిచేసే కీలక ఉద్యోగులను తొలగించిన మస్క్.. మరో సంచలన నిర్ణయం తీసుకున్నాడు. ఈ సారి యూజర్లకు షాకిచ్చాడు. ట్విట్టర్‌లో ఇప్పటి వరకు బ్లూ టిక్ పొందటానికి, దానిని నిలుపుకోవడానికి ఎలాంటి రుసుమును చెల్లించాల్సిన అవసరం లేదు. అయితే.. ఇక నుంచి ఆ సేవలు ఉచితం కాదు.
ఇప్పటి నుంచి బ్లూ టిక్ కలిగి ఉండాలంటే యూజర్లు నెలకు 8డాలర్లు(భారత కరెన్సీలో రూ.660) చెల్లించాల్సి ఉంటుందని మంగళవారం ట్వీట్ చేశాడు. కొనుగోలు శక్తి సమానత్వానికి, దేశానికి అనుగుణంగా ధర సర్దుబాటు చేశామని ఆయన చెప్పాడు. దీంతో వెరిఫైడ్ అకౌంట్ ఉన్నవాళ్లు నెలకు నగదు చెల్లించాల్సి ఉంటుంది. బ్లూటిక్ ఉన్నవారికి మరిన్ని ఫీచర్లు అందించే విషయాన్ని వెల్లడించారు.
ప్రియారిటీ రిప్లేస్, మెన్షన్స్ అండ్ సెర్చ్ వంటి సౌకర్యాలు లభించనున్నాయి. వీటి ద్వారా స్పామ్ లేదా స్కామ్‌ను ఓడించొచ్చని మాస్క్ పేర్కొంటున్నారు. ఇంకా లాంగ్ వీడియో లేదా ఆడియోను పోస్ట్ చేయొచ్చు. సగం వరకు యాడ్స్ ఉండొచ్చు. ''మాతో కలిసి పనిచేయడానికి ఇష్టపడే ప్రచురణకర్తల కోసం పేవాల్ బైపాస్''ఉంటుందని తెలిపారు.
మరీ మస్క్ తీసుకున్న నిర్ణయంపై యూజర్లు ఎలా స్పందిస్తారో చూడాలి.