పోలీసు వాహ‌నం పై బాంబు దాడి.. 8 మంది దుర్మ‌ర‌ణం

Eight Police Officers Killed In Explosives Attack In Colombia.పోలీసు వాహ‌నంపై బాంబు దాడి జ‌రిగింది. ఈ ఘ‌ట‌న‌లో 8 మంది

By తోట‌ వంశీ కుమార్‌  Published on  3 Sep 2022 4:07 AM GMT
పోలీసు వాహ‌నం పై బాంబు దాడి.. 8 మంది దుర్మ‌ర‌ణం

పోలీసు వాహ‌నంపై బాంబు దాడి జ‌రిగింది. ఈ ఘ‌ట‌న‌లో 8 మంది అధికారులు దుర్మ‌ర‌ణం చెందారు. ఈ ఘ‌ట‌న కొలంబియా దేశంలో చోటు చేసుకుంది. ఈ ఘ‌ట‌న‌ను కొలంబియా అధ్య‌క్షుడు పెట్రో సైతం ధ్రువీక‌రించారు.

"హులియా డిపార్ట్‌మెంట్‌కు చెందిన పోలీస్ అధికారులు వాహ‌నంలో ప్ర‌యాణిస్తుండ‌గా పేలుడు ప‌దార్థాల దాడి జ‌రిగింది. ఈ దాడిలో 8 మంది అధికారులు మ‌రణించారు. ఈ దాడిని ఖండిస్తున్నా. శాంతి విధ్వంసాన్ని ఈ చ‌ర్య‌లు సూచిస్తున్నాయి" అని అధ్య‌క్షుడు పెట్రో ట్వీట్ చేశారు.

కాగా.. ఈ దాడికి పాల్ప‌డింది ఎవ‌రు అన్నది ఇంకా తెలియ‌రాలేదు. దీనిపై ద‌ర్యాప్తు చేస్తున్న‌ట్లు అధికారులు వెల్ల‌డించారు. అయితే.. రివల్యూషనరీ ఆర్మ్డ్ ఫోర్సెస్ ఆఫ్ కొలంబియా అనే తిరుగుబాటు దారులు ఈ ప్రాంతంలో ప‌ని చేస్తున్న‌ట్లు స్థానిక మీడియా తెలిపింది.

ఆగ‌స్టు 7 కొలంబియా రాజధాని బొగోటాలోని బొలివర్ స్క్వేర్‌లో అధ్య‌క్షుడిగా 62 ఏళ్ల పెట్రో ప్ర‌మాణ స్వీకారం చేశారు. బొగోటా మాజీ మేయర్, కొలంబియా ఆధునిక చరిత్రలో మొదటి వామపక్ష నాయకుడు. పేదరికం సమస్యను పరిష్కరిస్తానని, మరింత సంపన్న నివాసితులపై పన్ను భారాన్ని పునఃపంపిణీ చేస్తానని, అలాగే గెరిల్లా పోరాట యోధులతో చర్చలకు బయలుదేరుతానని ప్ర‌మాణ స్వీకారంలో హామీ ఇచ్చారు.

ఇక పెట్రో ప్రమాణస్వీకారం చేసిన తర్వాత కొలంబియాలోని అతిపెద్ద డ్రగ్ ముఠా అయిన‌ గల్ఫ్ క్లాన్ (క్లాన్ డెల్ గోల్ఫో, దీనిని గైటానిస్ట్ సెల్ఫ్-డిఫెన్స్ ఫోర్సెస్ ఆఫ్ కొలంబియా అని కూడా పిలుస్తారు) కొత్త ప్ర‌భుత్వానికి మ‌ద్ద‌తుగా శాంతి ప్ర‌క్రియ‌లో చేరాల‌నే నిర్ణ‌యానికి వ‌చ్చింది.

Next Story