కొండచరియలు విరిగిపడి తొమ్మిది మంది మృతి చెందగా మరో 50 మందికి పైగా ఆచూకీ గల్లంతైంది. ఈ విషాద ఘటన మలేషియా రాజధాని కౌలాలంపూర్‌లో చోటు చేసుకుంది.
కౌలాలంపూర్ సమీపంలోని రోడ్డుపక్కన ఓ ఫామ్‌హౌజ్‌ను క్యాంప్ సౌకర్యాల కోసం అధికారులు ఏర్పాటు చేసుకున్నారు. కార్మికులు, అధికారులు క్యాంప్‌లో నిద్రపోతున్నారు. శుక్రవారం తెల్లవారుజామున మూడు గంటల సమయంలో ఒక్కసారిగా కొండచరియలు విరిగి క్యాంప్‌పై పడ్డాయి. ఆ సమయంలో క్యాంప్‌లో 79 మంది ఉన్నారు. 23 మంది సురక్షితంగా బయటపడినట్లు అధికారులు చెప్పారు. మిగిలిన వారి మంది ఆచూకీ లభించలేదు.
సమాచారం అందుకున్న వెంటనే రెస్య్కూ బృందాలు అక్కడకు చేరుకున్నాయి.కనిపించకుండా పోయినవారికోసం రెస్క్యూ ఆపరేషన్ నిర్వహిస్తున్నారు. క్యాంప్ వెనకాలు ఉన్న కొండ సుమారు 100 అడుగుల ఎత్తు నుంచి విరిగిపడినట్లు విపత్తు నిర్వహణ విభాగం డైరెక్టర్ నరోజమ్ ఖామిస్ చెప్పారు. సుమారు ఒక ఎకరం విస్తీరణంలో క్యాంప్‌పై కొండచరియలు విరిగిపడ్డాయి.