తైవాన్‌లో రెండు సార్లు కంపించిన భూమి.. ఇళ్లలోంచి బయటికి వచ్చిన జనం

Earthquake rocks Northeastern Taiwan.తైవాన్‌లో ఆదివారం మ‌ధ్యాహ్నాం భారీ భూకంపం సంభ‌వించింది. తైవాన్ రాజ‌ధాని

By తోట‌ వంశీ కుమార్‌  Published on  24 Oct 2021 9:10 AM GMT
తైవాన్‌లో రెండు సార్లు కంపించిన భూమి.. ఇళ్లలోంచి బయటికి వచ్చిన జనం

తైవాన్‌లో ఆదివారం మ‌ధ్యాహ్నాం భారీ భూకంపం సంభ‌వించింది. తైవాన్ రాజ‌ధాని తైపీతో పాటు ఈశాన్య తైవాన్‌లో మ‌ధ్యాహ్నాం 1.11 గంట‌ల స‌మ‌యంలో భూ ప్ర‌కంప‌న‌లు చోటుచేసుకున్నాయి. దీని తీవ్ర‌త రిక్ట‌ర్ స్కేల్‌పై 6.5గా న‌మోదు అయ్యింద‌ని తైవాన్‌ సెంట్రల్‌ వెదర్‌ బ్యూరో పేర్కొన‌గా.. అమెరిక‌న్ జియోలాజిక‌ల్ స‌ర్వే మాత్రం 6.2గా న‌మోదు అయిన‌ట్లు వెల్ల‌డించింది. భూమి నుంచి 67 కిలోమీట‌ర్ల లోతులో భూకంప కేంద్రాన్ని గుర్తించారు. దాదాపు 30 సెకండ్ల పాటు భూమి కంపించింద‌ని స్థానికులు వెల్ల‌డించిన‌ట్లు అక్క‌డి మీడియా తెలిపింది. భూకంపం కార‌ణంగా ప‌లు భ‌వ‌నాలు ఊగ‌డంతో.. భ‌యంతో ప్ర‌జ‌లు ఇళ్ల నుంచి బ‌య‌ట‌కు ప‌రుగులు తీశారు.

ఇక ప్ర‌ధాన భూకంపం అనంత‌రం 5.4 తీవ్ర‌త‌తో మ‌రోసారి భూమి కంపించింది. కాగా.. ఈ భూ ప్ర‌కంప‌న‌ల కార‌ణంగా ఇప్ప‌టి వ‌ర‌కు ఎలాంటి ప్రాణ‌, ఆస్తి న‌ష్టం వాటిల్లిన‌ట్లు అధికారిక స‌మాచారం వెలువ‌డ‌లేదు. అయితే.. దీనిపై అక్క‌డి స్థానికులు సోష‌ల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. భూకంపం కార‌ణంగా రూమ్ అద్దాలు ప‌గిపోయాయ‌ని ఓ నెటిజ‌న్ పేర్కొన‌గా.. దుకాణంలోని వ‌స్తువులు అన్ని నేల‌పై ప‌డిన‌ట్లు మ‌రోక‌రు ట్వీట్ చేశారు.

తైవాన్‌లో 2018లో 6.4 తీవ్ర‌త‌తో భూకంపం సంభవించ‌గా.. 17 మంది ప్రాణాలు కోల్పోయారు. 300 మంది గాయ‌ప‌డ్డారు.
Next Story