నేపాల్‌లోని ఖాట్మండులో తెల్లవారుజామున 4:37 గంటలకు రిక్టర్ స్కేలుపై 4.3 తీవ్రతతో భూకంపం సంభవించినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ ఆదివారం తెలిపింది. భూకంపం యొక్క లోతు సుమారు 135 కి.మీ, భూకంప కేంద్రం యొక్క ఖచ్చితమైన ప్రదేశం నేపాల్ రాజధాని నగరానికి 166 కి.మీ. దూరంలో ఉందని వెల్లడించింది. అయితే భూకంపం సంభవించడం వల్ల ఇప్పటివరకు ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరిగినట్లు సమాచారం అందలేదని అధికారులు తెలిపారు. తెల్లవారుజామున భూమి కంపించడంతో నిద్రలో ఉన్న ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ప్రజలు ఇళ్ల నుండి బయటకు పరుగులు తీశారు.