జపాన్ రాజధాని టోక్యోలో భారీ భూకంపం సంభవించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 6.1గా నమోదు అయ్యింది. గురువారం రాత్రి టోక్యోలోని చిబా ఫ్రిఫెక్చర్‌లో భూమి కంపించినట్లు ఆదేశ మెటరోలాజికల్ ఏజెన్సీ తెలిపింది. చిబా ప్రిఫెక్చర్‌లో 80 కిలోమీటర్ల లోతులో నమోదైనట్లు తెలిపింది. భూకంపం కారణాలు పలు భవనాలు ఊగినట్లు తెలుస్తోంది. అయితే.. భూకంప కారణంగా ఇప్పటి వరకు ఎలాంటి ఆస్తినష్టం గానీ, ప్రాణ నష్టం గానీ సంభవించలేదని అధికారులు తెలిపారు. ముందు జాగ్రత్త చర్యగా పలు బులెట్ రైళ్లను అధికారులు నిలిపివేశారు.
ఈ భూకంపం కారణంగా ప్రజలు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని నిపుణులు చెబుతున్నారు. సునామీ వచ్చే అవకాశం లేదన్నారు. భూకంపం కారణం కాసేపు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడింది. ప్రజలు ఇళ్లలోంచి బయటకు పరుగులు తీశారు. కాగా.. దీనిపై ప్రధాని ఫుమియో కిషిడా స్పందించారు. భూకంప ప్రభావిత ప్రాంతాల్లో తక్షణ చర్యలు చేపట్టాలని.. ప్రజలు ప్రాణాలు కాపాడుకునేందుకు ప్రయత్నించాలని ట్వీట్ చేశారు.