బుధవారం ఉదయం నేపాల్‌లో భూకంపం సంభవించింది. ఖాట్మండు నగరానికి 113 కిలోమీటర్ల దూరంలోని లాంజంగ్ జిల్లా భుల్ భులీ కేంద్రంగా భూకంపం వచ్చింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 5.8గా నమోదైందని జాతీయ భూకంపాల పరిశోధనా సంస్థ అధికారులు తెలిపారు. ఉదయం 5 గంటల 42 నిమిషాల ప్రాంతంలో భూఉపరితలాన 10 కిలోమీటర్ల లోతులో ప్రకంపనలు చోటు చేసుకున్నట్లు వెల్లడించింది.
భూప్రకంపన కారణంగా ఎలాంటి ప్రాణ, ఆస్తినష్టం జరగలేదని అధికారులు పేర్కొన్నారు. ఖాట్మండు పరిసరాల్లో భూమి కంపించడంతో ప్రజలు ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు. నేపాల్ దేశంలో గతంలో సంభవించిన భూకంపం వల్ల భారీ ఆస్తి, ప్రాణ నష్టం జరిగింది.