పుష్పికకే పట్టం.. వివాదం రేపిన మాజీ మిసెస్ వరల్డ్ అరెస్ట్
Mrs Sri Lanka pageant as Pushpika de Silva wins. మిసెస్ శ్రీలంక పోటీల్లో వేదికపై గందరగోళం సృష్టించిన మాజీ మిసెస్ వరల్డ్ కరోలిన్ జూరీని పోలీసులు అరెస్టు చేశారు.
By Medi Samrat Published on 9 April 2021 3:17 AM GMTమిసెస్ శ్రీలంక పోటీల్లో వేదికపై గందరగోళం సృష్టించిన మాజీ మిసెస్ వరల్డ్ కరోలిన్ జూరీని పోలీసులు అరెస్టు చేశారు. కొలంబోలోని నీలమ్ పోకునా థియేటర్‌లో ఆస్తి నష్టం కలిగించడంతో పాటు మిసెస్ శ్రీలంక 2021 విన్నర్ పుష్పిక డిసిల్వాను గాయపరిచారన్న ఆరోపణలపై కరోలిన్‌తో పాటు ఆమె సన్నిహితురాలిని అదుపులోకి తీసుకున్నారు.
పుష్పిక అర్హురాలు కాదంటూ కరోలిన్ ఆమె కిరీటం లాక్కొనేటప్పుడు పుష్పిక తలకు గాయం కాగా.. ఆమె ఆస్పత్రిలో చికిత్సపొందాల్సి వచ్చింది. తనపై దాడి చేశారంటూ పుష్పిక ఇచ్చిన ఫిర్యాదుతో వారిని అదుపులోకి తీసుకున్నట్టు పోలీసులు వెల్లడించారు.
కొలంబోలోని సిన్నిమోన్ గార్డెన్స్ పోలీస్ స్టేసన్ వద్ద పుష్పిక మీడియాతో మాట్లాడుతూ.. కరోలిన్ బహిరంగంగా క్షమాపణ కోరితే తాను కేసు వెనక్కి తీసుకుంటానన్నారు. కానీ అందుకు ఆమె సిద్ధంగా లేరని తెలిపారు. 'ఈ అంశాన్ని కోర్టు బయట తేల్చుకొనేందుకే ప్రయత్నిస్తున్నా.. కానీ కరోలిన్ నిరాకరిస్తున్నారు.. ఈ ఘటనను నేను క్షమించగలానేమో కానీ మరచిపోలేనన్నారు.
ఈ ఘటనతో వేదిక వద్ద జరిగిన నష్టంతో పాటు పుష్పికను గాయపరిచినట్టు తమకు అందిన ఫిర్యాదు మేరకు వారిని అరెస్టు చేసినట్టు పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు. అయితే, బెయిల్‌పై వారిద్దరూ గురువారం విడుదలయ్యారని, ఈ అంశంపై ఈ నెల 19న కోర్టులో విచారణ జరుగుతుందని పోలీసులు పేర్కొన్నారు.
అసలేం జరిగిందంటే
శ్రీలంకలో ఆదివారం రోజున జరిగిన మిసెస్ శ్రీలంక పోటీల్లో పుష్పిక డిసిల్వాను న్యాయ నిర్ణేతలు విజేతగా ప్రకటించి కిరీటం పెట్టారు. ఇంతలోనే మిసెస్ వరల్డ్ కరోలిన్ జూరీతో వేదికపైకి వెళ్లి పుష్పిక తలపై కిరీటాన్ని తీసేసారు. పెళ్లి చేసుకున్నవారే పోటీకి అర్హులని, విడాకులు తీసుకున్న వారు కాదంటూ కిరీటాన్ని రన్నరప్ తలకు పెట్టారు. దీంతో వేదికపై నుంచి దిగి వెళ్లిపోయిన పుష్పిక విలేకర్లతో మాట్లాడుతూ.. తాను భర్తకు దూరంగా ఉంటున్నానే తప్ప విడాకులు తీసుకోలేదని స్పష్టం చేసారు. దీంతో నిర్వాహకులు ఆమెకు కిరీటం ఇస్తున్నట్టు తెలపడంతో పాటు క్షమాపణలు చెప్పారు. తన విజయాన్ని ఒంటరి తల్లులకు అంకితం చేశారు పుష్పిక.
WATCH: Mrs Sri Lanka Pushpika De Silva was reinstated as the winner of the beauty pageant after her crown was forcibly removed by a former winner who accused her of being divorced pic.twitter.com/zlc7Ala4Lv
— Reuters India (@ReutersIndia) April 8, 2021