బ్రిటన్ రాణి ఎలిజబెత్-II గురువారం సాయంత్రం మరణించడంతో లండన్‌లోని బకింగ్ హామ్ ప్యాలెస్‌కు ప్రజల తాకిడి మొదలైంది. ప్యాలెస్‌కు వెళ్లే మార్గాలన్నీ ప్రజలతో నిండిపోయాయి. సంప్రదాయం ప్రకారం బకింగ్‌హాయ్ ప్యాలెస్ గేట్ల వద్ద పుష్పాలు ఉంచి రాణి ఎలిజబెత్-IIకు ప్రజలు నివాళులర్పిస్తున్నారు.
ఇదిలా ఉంటే.. క్వీన్ ఎలిజబెత్-II మరణాన్ని ప్రకటించిన కొన్ని నిమిషాల తరువాత బకింగ్‌హమ్ ప్యాలెస్‌పై జంట ఇంధ్రధనస్సులు(డబుల్ రెయిన్ బో) కనిపించాయి. ప్రజలు వాటిని చూసి ఆశ్చర్యపోయారు. అవి రాణి ఎలిజబెత్-II, ఆమె భర్త ఫిలిప్‌కు ప్రతీకగా ప్రజలు భావించారు. రాజు, రాణి ఆకాశంలో కలుసుకున్నారని చెప్పుకున్నారు. డబుల్ రెయిన్ బోను ప్రజలు తమ కెమెరాల్లో బంధించారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.