సమన్వయం లేకుండా సరిహద్దు పోస్టులకు వెళ్లొద్దు
Don't move to border posts without coordination with us Indian embassy in Ukraine.మూడవ రోజు కూడా కీవ్ నగరంపై బాంబుల
By తోట వంశీ కుమార్
మూడవ రోజు కూడా కీవ్ నగరంపై బాంబుల వర్షం కొనసాగుతూనే ఉన్నది. ఆ దాడుల నుంచి ప్రాణాలతో బయటపడేందుకు స్థానికులు అండర్‌గ్రౌండ్ మెట్రో స్టేషన్‌లో తలదాచుకుంటున్నారు. రష్యా బలగాలు ఇప్పటికే చెర్నోబిల్ పవర్ ప్లాంట్‌ను, కీవ్ ఎయిర్‌పోర్ట్ సహా పలు కీలక ప్రాంతాలను తమ ఆధీనంలోకి తీసుకుంది. ఇదిలా ఉంటే.. ఉక్రెయిన్ లో చిక్కుకున్న భారతీయులను సురక్షితంగా స్వదేశానికి తీసుకువచ్చే పనిలో భారత ప్రభుత్వం నిమగ్నమై ఉంది. ఈ నేపథ్యంలోనే ఉక్రెయిన్‌లోని భారత పౌరులకీ కీవ్‌లోని భారత రాయబార కార్యాలయం కీలక సూచనలు చేసింది.
సరిహద్దు పోస్టుల వద్ద భారత ప్రభుత్వ అధికారులతో ముందస్తు సమన్వయం లేకుండా భారతీయులు ఎవరైనా ఉక్రెయిన్ సరిహద్దు ప్రాంతాలకు వెళ్లొద్దని సూచించింది. పశ్చిమ నగరాల్లోనే ఉండాలని తెలిపింది. భారత పౌరులను తరలించడం కోసం పొరుగు దేశాలలోని మా ఎంబసీలతో రాయబార కార్యాలయాలతో నిరంతరం పని చేస్తున్నామన్నారు. ముందస్తు సమాచారం లేకుండా సరిహద్దు చెక్‌పాయింట్‌లకు చేరుకునే భారతీయ పౌరులకు సాయం చేయడం ఎంబసీకి కష్టంగా మారిందన్నారు. 'ఉక్రెయిన్‌లోని పశ్చిమ నగరాల్లో నీరు, ఆహారం, వసతి ప్రాథమిక సౌకర్యాలు అందుబాటులో ఉన్న చోట ఉండటం సురక్షితం. పరిస్థితిని పూర్తిగా తెలుసుకోకుండా సరిహద్దు చెక్ పాయింట్‌లకు రాకండి. ప్రస్తుతం తూర్పు సెక్టార్‌లో ఉన్న వారందరూ తదుపరి సూచనల వరకు ప్రస్తుత నివాస స్థలాల్లోనే ఉండాలి. వీలైనంత వరకూ ఇంట్లో లేదా షెల్టర్‌లలో ఉండాలి. ఆహారం, నీరు వంటి వాటిని అందుబాటులో ఉంచుకుని ఓపికగా ఎదురుచూడాలని' తెలిపింది.