డొనాల్డ్ ట్రంప్ దెబ్బ, టారిఫ్ ప్లాన్‌లో భారత్‌కు భారీగా వడ్డింపు
అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ కీలక నిర్ణయం ప్రకటించారు.
By Knakam Karthik
డొనాల్డ్ ట్రంప్ దెబ్బ, టారిఫ్ ప్లాన్‌లో భారత్‌కు భారీగా వడ్డింపు
అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ కీలక నిర్ణయం ప్రకటించారు. పలు దేశాల విదేశీ ఉత్పత్తులపై టారిఫ్ ప్లాన్‌ను బుధవారం వైట్ హౌస్‌లో అనౌన్స్ చేశారు. ఈ రోజును ట్రంప్ ‘లిబరేషన్ డే’గా నిర్వచించారు. ఒక వైపు ట్రేడ్ డీల్ పై సంప్రదింపులు జరుగుతున్నా.. భారత్‌పైనా భారీగా టారిఫ్‌లు విధించారు. భారత్‌పై 26 శాతం సుంకాలు విధిస్తున్నట్టు ప్రకటించారు. అలాగే.. అన్ని దేశాలకు సంబంధించి ఆటోమొబైల్ ఉత్పత్తులపై 25 శాతం టారిఫ్ అర్ధరాత్రి నుంచే అమల్లోకి వస్తాయని స్పష్టం చేశారు. తాము సుంకాలు తగ్గించాలంటే ముందుగా విదేశాలు తగ్గించాలని, అమెరికాలో ప్లాంట్లు పెట్టి, ఉత్పత్తి చేస్తే సున్నా సుంకం ఉంటుందని పేర్కొన్నారు. ఇది అమెరికా పరిశ్రమకు పునర్జన్మ అని అభిప్రాయపడ్డారు.
ఆయా దేశాలపై జాలితోనే ఇలా సగం సుంకాలు ప్రకటించినట్లు తెలిపారు. వీటిని రాయితీ టారిఫ్‌లుగా ట్రంప్ పేర్కొన్నారు. భారత్‌పై తాము 26 శాతం సుంకాలు విధిస్తున్నట్లు ట్రంప్ ప్రకటించారు. చైనాపై 34 శాతం సుంకాలు విధించనున్నట్లు అమెరికా అధ్యక్షుడు తెలిపారు. యూఎస్‌కు దిగుమతయ్యే అన్నిదేశాల ఉత్పత్తులపై కనీసం 10 శాతం టారిఫ్‌లు విధిస్తున్నట్లు ట్రంప్ ప్రకటించారు.
భారత్, చైనా, వియత్నాం సహా పలుదేశాలపై నిర్ణయించిన టారిఫ్‌లను వరుసగా వెల్లడించారు. విదేశాలు తమ ఉత్పత్తులపై ఎంత మొత్తంలో టారిఫ్‌లు విధిస్తున్నాయో.. అందులో సగం మేరకు తాము ఆ దేశాల ఉత్పత్తులపై విధిస్తామని పేర్కొన్నారు. అమెరికా ఉత్పత్తులపై భారత్ 52 శాతం సుంకాలు(కరెన్సీ మ్యానిపులేషన్, ట్రేడ్ బారియర్లు కలుపుకుని ) విధిస్తున్నట్టు ట్రంప్ తెలిపారు. అందుకు ప్రతిగా తాము భారత్‌పై 26 శాతం పన్ను వేస్తామని ప్రకటించారు. చైనాపై తమ ఉత్పత్తులపై 68 శాతం విధిస్తున్నదని, తాము ఆ దేశ ఉత్పత్తులపై 34 శాతం విధిస్తున్నట్టు వెల్లడించారు. అత్యధికంగా కంబోడియా(49 శాతం)వియత్నాం(46 శాతం) వేస్తామని, బేస్‌గా 10 శాతం టారిఫ్‌లు తప్పకుండా ఉంటాయని స్పష్టం చేశారు. ఆటోమొబైల్స్‌పై 25 శాతం టారిఫ్‌లు విధించే నిర్ణయాన్ని ధ్రువీకరించారు. విదేశాల్లో తయారైన ఆటోమొబైల్స్‌పై 25 శాతం సుంకాలు అమల్లోకి వస్తాయని ప్రకటించారు. అలాగే, విదేశాలు తమ ఉత్పత్తులపై ఎంత మొత్తంలో సుంకాలు విధిస్తున్నారో అంతే మొత్తంలో తాము విధిస్తామని, ఇదే రెసిప్రోకల్ టారిఫ్ ట్రంప్ వివరించారు. ఆ తర్వాత వివరాలు వెల్లడిస్తూ తాను సమాంతరంగా టారిఫ్‌లు విధించే వాడినేనని, కానీ, కొన్ని దేశాలు ఆ టారిఫ్‌లు భరించలేవని, అందుకే వాటిని సగానికి కుదించానని వివరించారు.