ఈ విచిత్రమైన చట్టాల గురించి మీకు తెలుసా?

చట్టాల విషయంలో ఒక్కో దేశానికి ఒక్కో రూల్ ఉంటుంది. కొన్ని దేశాలలో చట్టాల గురించి తెలిస్తే ఆశ్చర్యంగా అనిపిస్తుంది.

By అంజి  Published on  8 Jun 2023 12:00 PM IST
strange laws, Laws, Imprisonment, international news

ఈ విచిత్రమైన చట్టాల గురించి మీకు తెలుసా? 

చట్టాల విషయంలో ఒక్కో దేశానికి ఒక్కో రూల్ ఉంటుంది. కొన్ని దేశాలలో చట్టాల గురించి తెలిస్తే ఆశ్చర్యంగా అనిపిస్తుంది. అలాంటి దేశాల గురించి ఒక్కసారి తెలుసుకుందాం.

- ఇంగ్లాండ్‌లోని మసాచుసెట్స్‌లో ఎవరైనా స్నానం చేయకుండా నిద్రపోతే చట్ట విరుద్ధంగా పరిగణించబడుతుంది. ఇందుకుగానూ జైలు శిక్ష‌ కూడా విధిస్తారు.

- ఫసిఫిక్ సముద్రం దగ్గర్లో ఉన్న సమోవా అనే ఓ ఐలాండ్‌లో భార్య పుట్టిన రోజు భర్త మరిచిపోతే పెద్ద నేరంగా భావిస్తారు. ఆ తర్వాత భార్య కనుక ఫిర్యాదు చేస్తే భర్త జైలుకెళ్లాల్సిందే. మహిళాలకు సాధికారికత కల్పించేందుకు ఈ చట్టాలను రూపొందించినట్లు తెలుస్తోంది.

- స్విట్జర్లాండ్‌లో ఎవరైనా రాత్రి 10 గంటల తర్వాత బాత్‌రూంలో ఫ్లష్ చేసినా లేదా బాత్ రూం నుంచి ఏ విధమైనం శబ్దం వచ్చినా జరిమానా విధిస్తారు.

- పావురాలకు ఆహారం ఇస్తే శాన్‌ఫ్రాన్సిస్కో, ఇటలీలలో నేరంగా పరిగణించబడుతుంది. ఎవరైనా పావురాళ్లకు గింజలు వేస్తూ కనిపిస్తే వెంటనే అరెస్ట్‌ చేస్తారు.

- సింగపూర్‌లో 1992 జనవరి 3 నుంచి చూయింగ్‌ గమ్‌లను అమ్మడం, తయారు చేయడం నేరం. ఐతే నోటి సంబంధిత వ్యాధులతో బాధపడే వారు డాక్టర్‌ సలహామేరకు చూయింగ్‌ గమ్‌ నమలవచ్చని 2004లో అక్కడి ప్రభుత్వం మినహాయింపు ఇచ్చింది.

- నార్త్ కొరియాలో బ్లూ క‌ల‌ర్ జీన్స్ వేసుకొని బ‌య‌టికి వెళ్లితే నేరంగా పరిగణించబడుతుంది.

- ఇటలీలోని మిలాన్‌లో బహిరంగంగా సంచరించే ప్రతి పౌరుడూ ఎప్పుడూ నవ్వుతూ కనిపించాలి.ఎవరి ముఖంమీదనైనా నవ్వు మాయం అయ్యిందో. దానిని వెంటనే తీవ్ర నేరంగా పరిగణించి వంద డాలర్లవరకు జరిమానా విధిస్తారు. ఐతే ఆసుపత్రి, అంత్యక్రియలకు వెళ్లే సమయంలో మాత్రం మినహాయింపు ఉంటుంది.

- శ్రీలంకలో బుద్ధుడి విగ్రహంతో సెల్ఫీలు తీసుకోకూడదు. అలా చేయడాన్ని వారు అగౌరవంగా భావిస్తారు.

- మధ్య ఆసియా దేశం బురుండీలో గ్రూప్ జాగింగ్‌ను నిషేదించారు. దీన్ని అతిక్రమించేవారికి జీవిత ఖైదు తప్పదు.అయితే, ఒంటరిగా జాగింగ్ చేసేవారికి మాత్రం మినహాయింపు ఉంది. గ్రూప్ జాగింగ్ విద్రోహ చర్యలకు కారణమవుతుందనేది అక్కడి ప్రభుత్వ వాదన.

- వెనీస్‌లో పావురాలకు ఆహారం పెట్టడం నేరం. ఎందుకంటే..పావురాల రెట్టలను శుభ్రం చేయడానికి వెనీస్‌లోని ఒక్కో పౌరుడిపైనా 275 యూరోల (రూ.24,324) భారం పడుతోందట.

- ఆస్ట్రేలియాలోని విక్టోరియాలో గాలిపటాలను ఎగరవేయకూడదు.వాటి వల్ల ఇతరులకు ఇబ్బంది కలుగుతుందనే ఉద్దేశ్యంతోనే ఈ రూల్ పెట్టారట. అలాగే కొన్ని ప్రాంతాల్లో బహిరంగ ప్రదేశాల్లో ఆటలు ఆడటాన్ని కూడా నిషేదించారు.

- ఓక్లహోమాలో కుక్కను చూసి చీదరించుకోకూడదు. అలా చేస్తే జైలుకెళ్లాల్సిందే.

Next Story