కొబ్బరికాయ గురించి ఈ నిజాలు మీకు తెలుసా?
మన దేశంలో పూజలు, శుభకార్యాలకు కొబ్బరికాయను కచ్చితంగా వాడుతాం. కొబ్బరి నీళ్లలో ఎన్నో ఆరోగ్య లాభాలు కూడా ఉన్నాయి.
By అంజి Published on 11 Jun 2023 8:30 AM GMTకొబ్బరికాయ గురించి ఈ నిజాలు మీకు తెలుసా?
మన దేశంలో పూజలు, శుభకార్యాలకు కొబ్బరికాయను కచ్చితంగా వాడుతాం. కొబ్బరి నీళ్లలో ఎన్నో ఆరోగ్య లాభాలు కూడా ఉన్నాయి. వంటల్లో కూడా కొబ్బరి వాడకం ఎక్కువగానే ఉంటుంది. అయితే ఇవే కాకుండా ఇంకా మనకు తెలియని ఎన్నో విషయాలు కొబ్బరికాయలో ఉన్నాయి.
రక్తంలో ప్లాస్మాగా
కొబ్బరి నీళ్ళు నరాలలోకి ఎక్కిస్తే అది కొద్దిసేపటివరకు బ్లడ్ ప్లాస్మా గా కూడా పని చేస్తుంది. 1950లో సోలమన్ ద్వీపంలో ఓ వైద్యుడు డి-హైడ్రేటెడ్ పేషెంట్‌కు ఎక్కించి సక్సెస్ అయినట్టుగా ఆధారాలు కూడా ఉన్నాయి.
మొదటి ప్రపంచ యుద్ధంలో
మొదటి ప్రపంచ యుద్దంలో రసాయణ ఆయుధాలు ఎక్కువగా ఉపయోగించేవారు . అందువలన గ్యాస్ మాస్క్ ఖచ్చితంగా వాడాల్సి వచ్చేది. కానీ ఆ మాస్కులు సైనికులకు రక్షణ ఇచ్చేవి కాదు. దీంతో అప్పుడు కొబ్బరి నారను కాల్చి దానిలోంచి వెలువడిన పొడితో చేసిన మాస్కులు ఎక్కువగా రక్షణ ఇచ్చేవి. పసిఫిక్ మహాసముద్రంలోని అతిచిన్న దీవి ‘కిరిబటి’ అయితే ఏకంగా కొబ్బరినారతో మిలటరీ సూటును తయారు చేయించింది.
కట్టడాల కోసం
పూర్వ కాలంలో కొబ్బరి తినడానికి మాత్రమే కాకుండా కట్టడాలకు కూడా ఉపయోగించే వారు. పిలిప్పిన్స్ ప్రెసిడెంట్ ఎఫ్ ఎర్దినంద్ అర్చొస్ కొబ్బరి చెట్టు దూలాలతో రాజ భవనం కట్టించాడు . దీని కోసం అతడు ఏకంగా 10 మిల్లియన్ డాలర్లను ఖర్చు చేయాల్సి వచ్చింది.
బయో డీజల్
వేరుసెనగ నూనెతో పూర్వ కాలంలో ఇంజిన్లు నడిపేవారు. అలాగే రాబోయే రోజుల్లో కొబ్బరిని బయో డిజిల్ తయారు చేయడం కోసం వాడుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయి.