అన్ని కోట్ల డబ్బులు తాను ఆశించలేదని అంటున్న మిలిందా

Details Malinda gates divorce agreement. తాజాగా మిలిందా చేసిన ప్రకటన అందరినీ మరోమారు ఆశ్చర్యంలో ముంచెత్తింది. విడాకుల విషయంలో తాము ఎలాంటి ముందస్తు ఒప్పందమూ చేసుకోలేదని.

By Medi Samrat  Published on  5 May 2021 12:07 PM GMT
Melinda Gates

మైక్రోసాఫ్ట్ అధినేత బిల్‌గేట్స్ మిలిందాతో తన వైవాహిక బంధాన్ని ముగించుబోతున్నట్టుగా చేసిన ట్వీట్ ఆశ్చర్య పరచింది. పలుమార్లు ఆలోచించి, ఎంతో మథనం తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నట్టు పేర్కొన్నారు. తమ 27 ఏళ్ల వైవాహిక బంధానికి స్వస్తి పలకాలని నిర్ణయించుకున్నామని, ఈ కాలంలో ముగ్గురు అత్యద్భుతమైన పిల్లలను తీర్చిదిద్దామని అన్నారు. తాము విడిపోయినప్పటికీ బిల్‌మెలిందా గేట్స్ ఫౌండేషన్ ఎప్పటికీ కొనసాగుతుందని, ప్రపంచంలోని ప్రతి ఒక్కరు ఆరోగ్యంగా, నిర్మాణాత్మకంగా ఎదిగేలా తమ ఫౌండేషన్ కృషి చేస్తూనే ఉంటుందని స్పష్టం చేశారు. కొత్త ప్రపంచంలోకి వెళ్లేందుకు వీలుగా, తమ వ్యక్తిగత ఆకాంక్షలను, విడాకుల నిర్ణయాన్ని అందరూ గౌరవిస్తారని ఆశిస్తున్నాం అని ట్విటర్‌లో బిల్‌, మెలిందాలు ప్రకటించారు.

తాజాగా మిలిందా చేసిన ప్రకటన అందరినీ మరోమారు ఆశ్చర్యంలో ముంచెత్తింది. విడాకుల విషయంలో తాము ఎలాంటి ముందస్తు ఒప్పందమూ చేసుకోలేదని.. ఆస్తుల పంపకం గురించి కూడా తమ మధ్య ఎలాంటి అంగీకారమూ కుదరలేదన్నారు. బిల్ నుంచి తాను భరణాన్ని ఆశించడం లేదన్నారు. దాంపత్యపరమైన సాయాన్ని అర్థించబోనని తేల్చిచెప్పారు.

1994లో బిల్‌, మిలిందా వివాహ బంధంతో ఒక్కటయ్యారు. వారికి ఇద్దరు కూతుళ్లు జెన్నిఫర్‌ కేథరీన్‌ (25), ఫేబీ అడేల్‌ (18), కొడుకు రోనీ జాన్‌ (21) సంతానం. ప్రస్తుతం బిల్‌గేట్స్‌ వయస్సు 65 ఏళ్లు కాగా, మిలిందా వయస్సు 56 ఏళ్లు. తమ తల్లిదండ్రులు విడిపోవడంపై జెన్నిఫర్ స్పందించింది. నా తల్లిదండ్రులు విడిపోతున్నారన్న నిజాన్ని ఎలా ఎదుర్కోవాలో, నా భావోద్వేగాలు ఎలా అదుపు చేసుకోవాలో అర్థం కావడం లేదని తెలిపింది. నా కుటుంబ సభ్యులకు మద్దతుగా నిలిచేందుకు అన్ని రకాలుగా ప్రయత్నిస్తున్నాను. అమ్మానాన్నల విడాకులపై వ్యక్తిగతంగా నేనేమీ కామెంట్‌ చేయదలచుకోలేదని.. కానీ ఈ సమయంలో మీరిచ్చే మద్దతు నాకెంతో ఊరట కలిగిస్తుందని జెన్నిఫర్‌ గేట్స్‌ భావోద్వేగానికి గురైంది.


Next Story