టెన్షన్ పెడుతున్న ఫేస్‌బుక్ డేటా లీక్.. ఏమి చేయాలంటే..!
Facebook users' date leaked from 106 countries, including India. తాజాగా కూడా ఫేస్ బుక్ లో ఎంతో మంది డేటా లీక్ అవ్వడమే కాకుండా.. దాన్ని కాస్తా వేలానికి పెట్టారు.
By Medi Samrat Published on 4 April 2021 8:05 AM GMTసామాజిక మాధ్యమాల్లో ఫేస్ బుక్ ను విపరీతంగా ఉపయోగించే దేశాల్లో భారత్ కూడా ఒకటి. అయితే అందులో మనం ఉంచే డేటా ఎంత వరకూ సెక్యూర్ అనే విషయం గాల్లో దీపమే అని ఇప్పటికే పలు మార్లు తెలిసింది. ఎందుకంటే చాలా సార్లు ఫేస్ బుక్ డేటా లీక్ అయ్యిందనే వార్తలు వచ్చాయి. . ఏకంగా 50 కోట్ల యూజర్ల ఫేస్‌బుక్ డేటా లీక్ అయినట్లు వార్తలు వస్తున్నాయి. హ్యాకర్ల కోసం ఫేస్‌బుక్ డేటాను ఓ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారంటున్నారు.
ఈ డేటా లీక్ విషయం చాలా పాతదే అయినప్పటికీ.. మరోసారి భారీ ఎత్తున డేటా లీక్ అయిందన్న వార్త ఫేస్‌బుక్ యూజర్లలో కలకలం రేపుతోంది. ఫేస్‌బుక్‌తో పాటు ఇతర సోషల్ మీడియా వెబ్‌సైట్ల నుంచి ఈ డేటా సేకరించి ఆన్‌లైన్‌లో పెట్టినట్టు ప్రముఖ న్యూస్ ఏజెన్సీ ఇన్‌సైడర్ తన కథనంలో తెలిపింది. 106 దేశాల్లో ఫేస్‌బుక్ వాడుతున్నవారి ఫోన్ నెంబర్లు, ఫేస్‌బుక్ ఐడీలు, పూర్తి పేర్లు, లొకేషన్, పుట్టిన తేదీ, ఇమెయిల్ అడ్రస్‌లు ఆన్‌లైన్‌లో లీక్ అయ్యాయని.. ఫేస్‌బుక్ డేటా లీక్‌తో సుమారు 1.1 కోట్ల యూజర్లు ప్రభావితమయ్యారని తెలిపింది. కేంబ్రిడ్జ్ అనలిటికా వివాదం తర్వాత ఫేస్‌బుక్ 2018 లో ఫోన్ నెంబర్ల ద్వారా యూజర్లను సెర్చ్ చేసే ఆప్షన్‌ను తీసివేసింది. కేంబ్రిడ్జ్ అనలిటికా 8.7 కోట్ల ఫేస్‌బుక్ యూజర్ల సమాచారాన్ని సేకరించిందన్న వార్తలు అప్పట్లో కలకలం రేపాయి.
ఈ డేటా చాలా పాతదే అని తెలుస్తున్నా లీక్ అయిన సమాచారం మాత్రం కలకలం రేపుతోంది. ఫేస్‌బుక్‌తో పాటు ఇతర సోషల్ మీడియా వెబ్‌సైట్ల నుంచి ఈ డేటా సేకరించినట్టు బిజినెస్ ఇన్‌సైడర్ కథనం పబ్లిష్ చేసింది. ఫేస్‌బుక్ లీక్ డేటా చాలా పాతదని, 2019లోనే తమకు సమాచారం అందిందని, 2019 ఆగస్టులోనే ఈ సమస్యను పరిష్కరించామని ఫేస్‌బుక్ చెబుతోంది. 2019 డిసెంబర్‌లో ఉక్రెయినియన్ సెక్యూరిటీ రీసెర్చర్ కూడా 26.7 కోట్ల ఫేస్‌బుక్ యూజర్ల పేర్లు, ఫోన్ నెంబర్లు, యూజర్ ఐడీలు లీక్ అయినట్టు గుర్తించడం అప్పట్లో సంచలనం సృష్టించింది. ఎందుకైనా మంచిది మీ ఫేస్ బుక్ ఖాతా పాస్ వర్డ్స్ ను ఓ సారి చెక్ చేసుకోవడం మంచిదే..!