సహజమైన రాతి తోరణం డార్విన్ ఆర్చ్. ఇది స్కూబా డైవర్లు, ఫోటోగ్రాఫర్లు, క్రూయిజ్-షిప్ పర్యాటకులకు ఫేవరెట్ స్పాట్. దక్షిణ పసిఫిక్ సముద్రంలోని గాలా పోగోస్ ద్వీపకల్పంలోని డార్విన్ ఆర్చ్ ఈ ఉదయం 11.20 గంటల సమయంలో ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. ఈ విషయాన్ని ఈక్వెడార్ పర్యాటక శాఖ అధికారులు వెల్లడించారు. మొన్నటివరకూ రెండు స్తంభాలతో మీదన తోరణం ఆర్చ్ మాదిరిగా అలరించిన ఈ కట్టడం ఇప్పుడు వెలవెలబోయినట్టుగా కనిపిస్తోంది. అయితే రెండు వైపులా స్తంభాలుగా కనిపించే భాగం మాత్రం అలాగే ఉంది. తూర్పు ద్వీపానికి 600 మైళ్ల దూరంలో ఉన్న ఈ ఆర్చ్ కుప్పకూలిపోవడానికి సముద్రపు సహజ కోత కారణమని నిపుణులు అంటున్నారు.
ఇది ఒకప్పుడు డార్విన్ ద్వీపంలో భాగమని మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ ప్రాకృతిక నిర్మాణానికి ప్రముఖ జీవశాస్త్రవేత్త చార్లెస్ డార్విన్ పేరు పెట్టారు. యునెస్కో గుర్తించిన ప్రపంచ వారసత్వ సంపద జాబితాలో ఈ డార్విన్ ఆర్చ్‌కి స్థానం కల్పించారు.డార్విన్ ద్వీపం నుండి ఇది కిలోమీటర్ కన్నా తక్కువ, దూరంలో సముద్ర మధ్యలో ఉండే ఈ ప్రదేశం స్కూబా డైవర్లకు చాలా ఇష్టమైనది. అడ్వైంచర్స్, సాహసాలు చేసేవారికి ఫెవరెట్ స్పాట్.