సిత్రాంగ్ తుఫాను అల్లకల్లోలం.. 35 మంది మృతి, 10 వేల ఇళ్లు ధ్వంసం

Cyclone Sitrang toll in Bangladesh rises to 35, 10,000 homes damaged. పక్క దేశం బంగ్లాదేశ్‌లో సిత్రాంగ్‌ తుఫాను బీభత్సం సృష్టించింది. సిత్రాంగ్‌ తుఫాన్‌ ధాటికి బంగ్లా దేశం అస్తవ్యస్తమైంది.

By అంజి  Published on  26 Oct 2022 4:22 AM GMT
సిత్రాంగ్ తుఫాను అల్లకల్లోలం.. 35 మంది మృతి, 10 వేల ఇళ్లు ధ్వంసం

పక్క దేశం బంగ్లాదేశ్‌లో సిత్రాంగ్‌ తుఫాను బీభత్సం సృష్టించింది. సిత్రాంగ్‌ తుఫాన్‌ ధాటికి బంగ్లా దేశం అస్తవ్యస్తమైంది. బెంగాల్‌ తీరం సమీపంలో బంగ్లాదేశ్‌లోని బైరిసాల్‌ దగ్గర తుఫాను తీరం దాటింది. దీని ప్రభావంతో దేశంలో కుండపోత వర్షం పడుతోంది. తుఫాను కారణంగా ఇప్పటి వరకు 35 మంది మృతి చెందారు. మృతుల సంఖ్య మరింత పెరిగే ఛాన్స్‌ ఉందని అధికారులు చెబుతున్నారు. సుమారు 10 వేల ఇళ్లు ధ్వంసం అయ్యాయని అధికారులు వెల్లడించారు. తుఫాను బీభత్సంతో విద్యుత్‌ సరఫరాకు అంతరాయం ఏర్పడింది.

కరెంట్‌ సరఫరా నిలిచిపోవండంతో 15 తీరప్రాంత జిల్లాల్లో సుమారు 8 మిలియన్ల మంది ప్రజలు చీకట్లలోనే మగ్గుతున్నారని, 15 ఎకరాల్లో పంట నాశనమయిందని ప్రభుత్వం వెల్లడించింది. వేల సంఖ్యలో ఫిషింగ్‌ ప్రాజెక్టులు కొట్టుకుపోయాయని తెలిపింది. విమాన రాకపోకలు నిలిచిపోయాయని, వరదల వల్ల రోడ్లు తెగిపోవడంతో రవాణా వ్యవస్థ స్తంభించిపోయిందని పేర్కొన్నది బంగ్లాదేశ్ సోమవారం 2.19 లక్షల మంది ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించింది. సిత్రాంగ్ తుఫాను దేశం యొక్క నైరుతి తీరప్రాంతాలను ఎక్కువ ప్రభావం చూపింది. తుఫాను ప్రభావానికి గురయ్యే వ్యక్తుల కోసం బంగ్లాదేశ్ అధికారులు 6,925 తుఫాను కేంద్రాలను సిద్ధంగా ఉంచారని విపత్తు నిర్వహణ మంత్రిత్వ శాఖ ప్రతినిధి మహ్మద్ మోనిరుజ్జమాన్ తెలిపారు.

6,000 హెక్టార్ల (15,000 ఎకరాలు) కంటే ఎక్కువ పంటలు నాశనమయ్యాయని బంగ్లాదేశ్‌ సర్కార్‌ పేర్కొంది. వేల సంఖ్యలో మత్స్యకార ప్రాజెక్టులు కూడా కొట్టుకుపోయాయి. రోజంతా భారీ వర్షాలు దేశాన్ని అతలాకుతలం చేశాయి. దక్షిణ, నైరుతి బంగ్లాదేశ్‌లోని తీర ప్రాంతాలలోని అనేక ప్రాంతాలను వరదలు ముంచెత్తాయి. బంగ్లాదేశ్ 160 మిలియన్లకు పైగా జనాభా కలిగిన డెల్టా దేశం. తుఫాను కారణంగా దేశ వ్యాప్తంగా విద్యాసంస్థలను మూసివేశామని వెల్లడించింది. కాగా, తుఫాను ప్రభావంతో పశ్చిమ బెంగాల్‌లోని కొన్ని జిల్లాల్లో జోరు వానలు కురుస్తున్నాయి. అయితే తుఫాను అల్పపీడనంగా బలహీనపడిందని భారత వాతావరణ విభాగం వెల్లడించింది.

Next Story