బ్రెయిన్ ట్యూమర్ ప్రాణాంతకమా?
అన్ని అవయవాల పనితీరును నియంత్రించేది, నిర్వర్తించేది మెదడే. ఇంతటి కీలకమైన మెదడులో కణితి(ట్యూమర్) ఏర్పడితే? ఎవరికైనా ఆందోళనే
By అంజి Published on 7 Jun 2023 5:15 AM GMTబ్రెయిన్ ట్యూమర్ ప్రాణాంతకమా?
అన్ని అవయవాల పనితీరును నియంత్రించేది, నిర్వర్తించేది మెదడే. ఇంతటి కీలకమైన మెదడులో కణితి(ట్యూమర్) ఏర్పడితే? ఎవరికైనా ఆందోళనే. నిజానికి మెదడు కణితులన్నీ క్యాన్సర్ కానవసరం లేదు. మామూలువీ కావొచ్చు. 'వరల్డ్ బ్రెయిన్ ట్యూమర్ డే' సందర్భంగా ఇవి తెలుసుకుందాం..
ఎలా ఏర్పడుతుంది?
శరీరంలోని అన్ని అవయవాల నియంత్రణ అంతా మెదడు ద్వారానే జరుగుతుంది. అలాంటి మెదడు కణితి ప్రాణాంతకమే. మెదడులోని ఏదైనా భాగంలో అసాధారణ కణాలు ఉత్పత్తి చేసినప్పుడు అది బ్రెయిన్ ట్యూమర్‌కి దారితీస్తుంది.
కారణాలు..
బ్రెయిన్ ట్యూమర్ కలగడానికి నిర్దిష్టమైన కారణం ఇంకా తెలియదు. అయితే రేడియేషన్‌కు గురికావడం వల్ల బ్రెయిన్ ట్యూమర్ వస్తుందని వైద్యులు నమ్ముతున్నారు. మొబైల్ ఫోన్ వంటి గాడ్జెట్లు కూడా బ్రెయిన్ ట్యూమర్‌కు దారితీస్తుందట.
లక్షణాలు
నేషనల్ హెల్త్ పోర్టల్ డేటా ప్రకారం.. మెదడులోని కణితి స్థానాన్ని బట్టి లక్షణాలు మారవచ్చు. దృష్టి సమస్యలు, తలనొప్పి, మూర్ఛలు, వాంతులు, మానసిక సమస్యలను గమనించవచ్చు. కొన్ని సార్లు వ్యక్తి నడవడం, మాట్లాడటం, అనుభూతి చెందడంలో కూడా ఇబ్బందిని అనుభవించవచ్చు.
రోగనిర్ధారణ ఇలా..
బ్రెయిన్ ట్యూమర్‌ను నిర్ధారించడానికి రకరకలా పరీక్షలు చేస్తారు. ఎంఆర్‌ఐ, సిటీ స్కాన్, యాంజియోగ్రామ్, న్యూరోలాజిక్ పరీక్ష, స్పైనల్ ట్యాప్ లాంటి పరీక్షల ద్వారా బ్రెయిన్ ట్యూమర్‌ను నిర్ధారిస్తారు.
చికిత్సలు
రెడీయో థెరపీ, కీమో థెరపీ, స్టెరాయిడ్లు, వెంట్రిక్యులర్ పెరిటోనియల్ షంట్ పద్దతుల ద్వారా బ్రెయిన్ ట్యూమర్‌కు చికిత్స చేస్తారు. ఇందులో రేడియో థెరపీ ద్వారా కణాలు అధిక శక్తి కిరణాలు రేడియేషన్‌కు గురిచేస్తారు. కీమోథెరపీ ద్వారా క్యాన్సర్ కణాలను చంపడానికి యాంటీ క్యాన్సర్ మందులు శరీరానికి సరఫరా చేయబడతాయి. మెదడు లోపలి నుంచి అదనపు ద్రవాన్ని బయటకు పంపడం కోరకు వెంట్రిక్యులర్ పెరిటోనియల్ షంట్ పద్ధతిని ఉపయోగిస్తారు.