ఆ ప‌ని చేస్తుండ‌గా హైడ్రోజ‌న్ బెలూన్ తాడు తెగింది.. 2 రోజులు గాలిలోనే

Chinese man trapped aloft in hydrogen balloon for 2 days.హైడ్రోజ‌న్ బెలూన్ సాయంతో ఫైన్ కాయ‌లు కోస్తుండ‌గా తాడు తెగింది.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  9 Sep 2022 6:15 AM GMT
ఆ ప‌ని చేస్తుండ‌గా హైడ్రోజ‌న్ బెలూన్ తాడు తెగింది.. 2 రోజులు గాలిలోనే

అప్పుడ‌ప్పుడు కొన్ని అనుకోని ఘ‌ట‌న‌లు జ‌రుగుతుంటాయి. ఆ స‌మ‌యంలో భ‌య‌ప‌డ‌కుండా ఉండి..కాస్త బుర్ర వాడితే దాదాపుగా ఎలాంటి క‌ష్టం నుంచైనా బ‌య‌ట‌ప‌డ‌వ‌చ్చు. హైడ్రోజ‌న్ బెలూన్ సాయంతో ఇద్ద‌రు వ్య‌క్తులు ఫైన్ కాయ‌లు కోస్తుండ‌గా దాని తాడు తెగింది. ఇద్ద‌రిలో ఓ వ్య‌క్తి కింద‌కు దూకేయ‌గా.. రెండో వ్య‌క్తి అందులోనే చిక్కుకుపోయాడు. రెండు రోజుల పాటు గాల్లోనే ఉన్నాడు. దాదాపు 320 కిలోమీట‌ర్ల దూరం ప్ర‌యాణించాడు. ఎట్ట‌కేల‌కు క్షేమంగా బ‌య‌ట‌ప‌డ్డాడు. ఈ ఘ‌ట‌న చైనా దేశంలో చోటు చేసుకుంది.

వివ‌రాల్లోకి వెళితే.. హిలాంగ్ షియాంగ్ ప్రావిన్స్‌లోని ఫారెస్ట్ పార్క్‌లో ఆదివారం హు(40)తో పాటు మ‌రో వ్య‌క్తి హైడ్రోజ‌న్ బెలూన్ సాయంతో ఫైన్ కాయ‌లు కోస్తున్నారు. అయితే.. ఒక్క‌సారిగా తాడు తెగిపోయింది. మ‌రో వ్య‌క్తి కింద‌కు దూకేయ‌గా.. హు మాత్రం అందులోనే ఉండిపోయాడు. బెలూన్‌తో పాటే ఎగిరిపోయాడు. కింద‌కు దూకిన వ్య‌క్తి ఇచ్చిన స‌మాచారం మేర‌కు అధికారులు హు కోసం గాలింపు చేప‌ట్టారు. హు వ‌ద్ద సెల్‌ఫోన్ ఉండ‌డంతో ఫోన్ చేసి ఎలా కింద‌కు దిగాలో స‌ల‌హాలు, సూచ‌న‌లు ఇచ్చారు. వారు చెప్పిన‌వి చేస్తూ.. ఇలా దాదాపు 320 కిలో మీట‌ర్లు ప్ర‌యాణించిన హు.. ర‌ష్యా స‌రిహ‌ద్దుల్లో కింద‌కు దిగాడు.

అతడు ఆరోగ్యంగానే ఉన్న‌ట్లు అధికారులు తెలిపారు. అయితే..రెండు రోజుల పాటు నిల‌బ‌డే ఉండ‌డంతో వెన్నునొప్పితో బాధ‌ప‌డుతున్న‌ట్లు చెప్పారు. ప్ర‌స్తుతం ఆస్ప‌త్రిలో కోలుకుంటున్న హు త‌న వివ‌రాల‌ను చెప్పేందుకు నిరాక‌రిస్తున్నాడు.

Next Story